Sathya Raj : లెజెండరీ తమిళ నటుడు సత్యరాజ్ గురించ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. బాహుబలిలో ‘ కట్టప్ప’ పాత్ర చాలా ఫేమస్ అయింది. బాహుబలి1, 2లో సత్య రాజ్ పోషించిన కట్టప్ప పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలో అత్యంత కీలకం అయిన కట్టప్ప.. బహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న అందరిలోనూ చాలా క్యూరియాసిటీ రేకెత్తించింది. ఇదే బాహుబలి 2 సక్సెస్ కావడానికి కారణం అయింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ లెజెండరీ యాక్టర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. సత్యరాజ్ కు కరోనా పాజిటివ్ గా రావడంతో.. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిసింది. అయితే సత్యరాజ్ ఆరోగ్యంపై ఆయన ఫ్యాన్స్, సిని అభిమానులు కలవరానికి గురవుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవల కోలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల్లో వరసగా సినీ తారలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ థమన్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్ వంటి వారు కరోనా బారిన పడ్డారు. తమిళ సినీ పరిశ్రమలో కమెడియన్ వడివేలు, చియాన్ విక్రమ్, అర్జున్, కమల్ హాసన్ తదితరులు కరోనా బారిన పడ్డారు.
పెరుగుతున్న కరోనా కేసులు..
సినీ పరిశ్రమ ప్రముఖులే కాకుండా, దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ అందర్ని కలవరపరుస్తోంది. గత కొద్ది రోజులుగా ఇండియలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.






























