ఆవిరి పడితే కరోనా తగ్గిపోతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే?

0
154

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వైరస్ బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదట్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలను కరోనా వైరస్ లక్షణాలు భావించేవారు. అయితే ప్రస్తుతం వైరస్ లక్షణాలలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

దగ్గు, జలబు, జ్వరం మాత్రమే కాకుండా రుచి తెలియకపోవటం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం కరోనా లక్షణాలు.చాలామంది నీటి ఆవిరి పట్టడం ద్వారా కరోనా వైరస్ చనిపోతుంది, వ్యాధి తగ్గుతుందని భావిస్తుంటారు. నిజానికి నీటి ఆవిరి పట్టడం ద్వారా వైరస్ చనిపోదని నిపుణులు తెలియజేస్తున్నారు.

యు ఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నీటి ఆవిరి పట్టడం వంటి ఇంటి చిట్కాల ద్వారా వైరస్ ఏమాత్రం తగ్గదని తెలియజేశారు. ఆవిరి పట్టడం వల్ల దగ్గు జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు మాత్రమే తగ్గుతాయి. ఆవిరి పట్టడం ద్వారా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం మాత్రమే కలుగుతుంది.

ఆయుర్వేద వైద్యులు మాత్రం వేడి నీళ్లు తాగుతూ, ఆవిరి పట్టుకోవడం ఎంతో మంచిదని చెబుతున్నారు. నీళ్లు తాగడం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉండవు. అదేవిధంగా బయటకు వెళుతూ వచ్చేవారు అప్పుడప్పుడు నీటి ఆవిరి పట్టడం వల్ల మంచిది అంటున్నారు. అదేవిధంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం కోసం సరైన ఆహార పదార్థాలను తీసుకోవాలి రోగనిరోధకశక్తిని పెంచుకుని వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here