కోవిడ్ – 19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి!

0
105

మే 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సిన్ ఉచితంగానే అందిస్తామని ప్రకటించింది.వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ క్రమంలోనే మే 28వ తేదీ నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది.

వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ అనగానే చాలామందిలో ఎన్నో సందేహాలు తలెత్తుతాయి. రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి? వ్యాక్సినేషన్ ఏ విధంగా తీసుకోవాలి అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగా మన పేరు అడ్రస్ వంటి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం selfregistration.cowin.gov.in అనే లింక్ అందుబాటులో ఉంచింది.18 సంవత్సరాలు పైబడినవారు వ్యాక్సిన్ ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలి అనే విషయాలను ఇందులో నమోదు చేయాలి. ఈ లింక్ ను మీరు స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా అయినా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

  • ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి selfregistration.cowin.gov.in అని టైప్ చేస్తే చాలు రిజిస్ట్రేషన్ ఫేజ్ వస్తుంది.
  • రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత గేట్ ఓటిపి అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేయాలి.
  • ఆ తరువాత మరో పేజ్ ఓపెన్ అయ్యి ఏదైనా గుర్తింపు కార్డు అనగా ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ,పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి.

*మీరు గుర్తింపుకార్డులు ఇచ్చిన కార్డు పై ఉన్న పేరు నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ బటన్ క్లిక్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ తరువాత వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలి ఎక్కడ వేయించుకోవాలి అనే విషయాలను నమోదు చేయాలి.

  • పై వివరాలన్నీ నమోదు అయిన తర్వాత స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా అందులో షెడ్యూల్ అపాయింట్మెంట్ ఫర్ వ్యాక్సినేషన్ క్లిక్ చేస్తే మీ రాష్ట్రం, జిల్లా ఇతర వివరాలను నమోదు చేయాలి.
  • ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాల లిస్ట్ వస్తుంది. అందులో మీకు దగ్గరగా ఉన్న కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా వ్యాక్సిన్ తేదీ సమయాన్ని ఎంపిక చేసుకొని కన్ఫామ్ బటన్ పై క్లిక్ చేయాలి.

*మీ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ వివరాలు అన్ని స్క్రీన్ పై కనిపిస్తాయి. అవసరమైతే ఈ వివరాలను స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.ఓకే మొబైల్ నెంబర్ పై మీ కుటుంబంలోని నలుగురు వ్యక్తుల వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయానికంటే ముందుగా కేంద్రానికి చేరుకొని సరైన సమయంలో వ్యాక్సిన్ తీసుకోవాలి.

*వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లేటప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఇచ్చిన గుర్తింపు కార్డులు తీసుకుని వెళ్లాలి.ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై ఎటువంటి సందేహాలు ఉన్నా హెల్ప్ లైన్ నంబర్ 1075 కి ఫోన్ చేసి మీ సందేహాలను అడగవచ్చు.

*ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here