ప్రపంచంలోనే పెద్ద వ్యాధి.. డెల్టా స్ట్రెయిన్.. ఇది వచ్చిందంటే?

0
91

భారతదేశంలో రెండవ దశ కరోనా వ్యాపించిన నేపథ్యంలో రోజురోజుకు వ్యాధి తీవ్రత అధికం అవుతూ ఎంతో మంది మృత్యువాత పడిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య కొంతమేర తగ్గుముఖం పట్టిన మరణాల సంఖ్య అదే స్థాయిలో కొనసాగుతోంది. భారతదేశంలో వ్యాపించిన రెండవ దశ డెల్టా వేరియంట్ ఎంతో ప్రమాదకారిగా మారుతుందని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో అత్యధికంగా అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు గుర్తించారు.

సాధారణంగా కరోనా బారినపడిన వారిలో తీవ్రమైన చలి, జ్వరం, తలనొప్పి, రుచి వాసన లేకపోవడం అనేటివి సర్వసాధారణ లక్షణాలు. కానీ ఈ వేరియంట్ ప్రభావం వల్ల రోగులలో కనిపించని వినికిడి లోపం, గ్యాస్ట్రిక్ సమస్యలు, రక్తం గడ్డ కట్టడం,గ్యాంగ్రేన్ వంటి లక్షణాలు ఈ వేరియంట్ తో ముడిపడి ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఈ విధమైన డెల్టా వేరియంట్ ను మొట్టమొదటిసారిగా భారతదేశంలో గుర్తించినప్పటికీ సుమారు 60 దేశాలకు పైగా ఈ వైరస్ పాకడంతో అన్ని ఆ దేశాల మధ్య రాకపోకల పై తీవ్రమైన ఆంక్షలు విధించారు. ఈ వేరియంట్ వల్ల ఈ విధమైనటువంటి లక్షణాలు తలెత్తడంతో రోజురోజుకు బాధితుల సంఖ్య అధికమవుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ పై ఆంక్షలు తీసివేయడం పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

ఈ విధమైనటువంటి వేరియంట్ తీవ్రమైన లక్షణాలలో గ్యాంగ్రేన్ తీవ్రమైన కండరాల నొప్పికి దారి తీసినట్లు ముంబయిలోని సెవెల్ హిల్స్ ఆస్పత్రి కార్డియాలజిస్ట్ గణేశ్ మనుధానే అన్నారు. ఈ విధమైనటువంటి గ్యాంగ్రేన్ లక్షణాలతో బాధపడే వారు గత ఏడాది కేవలం 2,3 కేసులను మాత్రమే చూశామని ప్రస్తుతం ఈ కేసులు వారానికి ఒకటి నమోదు అవుతున్నట్లు గణేష్ తెలిపారు. ఈ విధమైనటువంటి లక్షణం మన శరీరంలో రక్తం సరఫరా సరిగా లేకపోవడం వల్ల చర్మ కణజాలం చనిపోయే స్థితిని తెలియజేస్తుందని ఈ సందర్భంగా డాక్టర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here