తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నిత్యం సామాజిక సేవలో ఎంతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎవరికైనా ఏదైనా ఆపద ఉందంటే వెంటనే స్పందించి వారికి సహాయం చేస్తుంటారు. ప్రతిభ దాగి ఉన్న యువతను బయటకు వెలికి తీయడంలో కేటీఆర్ ముందుంటారు.

తాజాగా గత నెలలో మెదక్ జిల్లాకు చెందిన ఒక గాయని తన స్వరంతో అద్భుతంగా పాట పాడిన సంగతి తెలిసిన కేటీఆర్ వెంటనే ఆ వీడియోను సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్ లకు ట్యాగ్ చేస్తూ ఇలాంటి ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించండి అని కోరారు. కేటీఆర్ చేసిన ట్వీట్ కి దేవిశ్రీప్రసాద్ స్పందిస్తూ… తప్పకుండా తనకు అవకాశం కల్పిస్తానని రీట్వీట్ చేశారు.
నాడు ఇచ్చిన మాటను దేవి శ్రీ ప్రసాద్ నేడు నిలబెట్టుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన ఈ గాయనినీ
వెతికి పట్టుకుని మరీ తన షోలో పాట పాడించానని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని కేటీఆర్‌కు దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.ఈ విధంగా దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మాటపై నిలబడటంతో కేటీఆర్ ఎంతో సంబరపడి అతని పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ మీ సపోర్ట్ ఎప్పటికి మరువలేము.. మీ సపోర్ట్ కారణంగానే అంత మంచి గాయనిని మాకు తెలియజేశారు అంటూ దేవి పేర్కొన్నారు.
































