లావు తగ్గాలంటే ఉదయాన్ని బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలా..? వద్దా..?

0
360

ఉదయం లేచిన మొదలు బ్రేక్ ఫాస్ట్ చేయనిదే చాలామందికి పని మొదలు కాదు. అయితే అధిక బరువుతో బాధపడే వారు ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ వల్ల కూడా బరువు పెరుగుతున్నామని.. వాటిని దూరం పెట్టేద్దామని అనుకుంటుంటారు. కానీ అది చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఎక్కువగా క్యాలరీలు ఉంటే.. సాధారణంగా బరువు పెరిగి లావుగా కనిపిస్తారు.

అయితే క్యాలరీలు తగ్గించుకోవడానికి వ్యాయమాలు చేయాలి కానీ.. బ్రేక్ పాస్ట్ మానకూడదు అనేది వైద్యులు చెబుతున్న మాట. సమయానికి నిద్ర పోకపోవడం, వేళకు తినకపోవడం కూడా బరువుకు కారణాలు అవుతున్నాయి. నిజానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తిననివారు.. బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారి కంటే వేగంగా బరువు పెరుగుతారట. ఎందుకంటే ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే శరీరంలో మెటబాలిజం నెమ్మదించి.. ఆకలి ఎక్కువగా వేస్తుంది.

దీంతో మధ్యాహ్నం అన్నం తినే సమయంలో ఎక్కువగా లాగేస్తారు. దీంతో బరువు పెరగడానికి ఇది కారణం అవుతుంది. ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. అదేంటంటే.. 54 శాతం వరకు టైప్ 2 డయాబెటీస్ వస్తుందట.

దీనిని హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ పరిశోధనలో తేలిందట. వేరు శనగ వెన్న తీసుకోవడంలో లావు తగ్గడానికి అవకాశం ఉందట. ఆకలిని తగ్గించడంలో ఎక్కువగా ఉపయోగపడతాయట. దీనిని ఎక్కువగా చాలామంది తీసుకోరు. కారణం ఏంటంటే.. ఇందులో కొవ్వు కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ దీనిని మితంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.