ప్రస్తుతం డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ నాలుగు వారాల పాటు జైలులో గడిపి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ మాదిరిగానే గతంలో షారుఖ్ ఖాన్ కూడా జైలుకి వెళ్లి వచ్చారని చాలామందికి తెలియదు.అయితే షారుక్ జైలుకు వెళ్ళడానికి గల కారణం కేవలం ఒక జర్నలిస్టు కత్తితో బెదిరించడం వల్ల జైలుకు వెళ్లానని స్వయంగా షారుక్ ఒక సందర్భంలో వెల్లడించారు.

తెహల్కా డాట్ కామ్ ఆర్గనైజ్ చేసిన ‘థింక్ 2012’ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న షారుక్ ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు.అయితే ఆ జర్నలిస్టు కత్తితో బెదిరించడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… గతంలో షారుక్ ఖాన్ కి ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉందని ఆ జర్నలిస్ట్ రాయడంతో అందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన అతని పై కత్తితో దాడి చేశారని తెలిపారు.
అయితే తనకు గౌరీ ఖాన్ తో పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకు ఆ జర్నలిస్టు ఈ విధంగా రాయడమే కాకుండా తన వ్యక్తిత్వం మంచిది కాదంటూ రాయడంతో షారుక్ ఖాన్ పెళ్లి సమయంలో తన మామ ఇచ్చిన కత్తిని తీసుకొని ఆ కత్తితో జర్నలిస్టును బెదిరించినట్లు తెలిపారు. ఇలా అతనిని బెదిరించినందుకుగాను షారుఖ్ జైలుకు వెళ్లారని తెలిపారు.
అయితే జైలులో ఉన్నప్పుడు తనకు ఎవరికైనా ఫోన్ చేసుకునే అవకాశం లభిస్తే తాను కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకుండా ఆ జర్నలిస్టుకి ఫోన్ చేసి బెదిరించారని, బయటకు వచ్చిన తర్వాత నీ అంతు చూస్తా, నిన్ను నరుకుతా అంటూ షారుక్ ఆ జర్నలిస్ట్ ను బెదిరించినట్లు తెలిపారు. ఇలా షారుక్ ఖాన్ గతంలో జైలుకు వెళ్లి వచ్చినట్లు ఆయన తెలిపారు.
































