బుల్లితెర పై ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షకాభిమానం సంపాదించుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. గతంలో నాలుగు సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా సెప్టెంబర్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం ఎంతో అంగరంగ వైభవంగా ఐదవ సీజన్ ను ప్రారంభించింది. గత రెండు సీజన్ల మాదిరిగానే ఐదవ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లకు నాగార్జున గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలోకి నాలుగవ కంటెస్టెంట్ గా ఇండియన్ ఐడల్ విన్నర్, సింగర్ శ్రీ రామచంద్ర ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా స్టేజ్ పై నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలోని “నేను నేనుగా లేనే నిన్న మొన్న లా” అనే పాటను లైవ్ లో పాడి అందరిని సందడి చేశారు. శ్రీ రామచంద్ర పలు భాషలలో వందల సంఖ్యలో పాటలు పాడి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈక్రమంలోనే 2010వ సంవత్సరంలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ సింగింగ్ కార్యక్రమం ఇండియన్ ఐడల్ విన్నర్ గా నిలిచి మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.
ఈ క్రమంలోనే శ్రీ రామచంద్రకు హీరోగా అవకాశాలు కూడా వచ్చాయి. సింగర్ శ్రీరామచంద్ర హీరోగా మూడు సినిమాలలో నటించారు. అయితే ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేయకుండా సింగర్ గా స్థిరపడిన శ్రీ రామచంద్ర బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా వేదికపైకి వచ్చిన శ్రీరామచంద్ర నాగార్జున కోసం గీతాంజలి సినిమాలో నుంచి ఒక పాటను పాడి అతనికి డెడికేట్ చేస్తూ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి 17 వ కంటెస్టెంట్ గా, ఫేమస్ యూట్యూబర్, సింగర్, రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ కాజల్ బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎంతో చిలిపిగా అల్లరి పనులు చేస్తూ ఉండే కాజల్ బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇవ్వడంతోనే నాగార్జునతో ఐలవ్యూ చెప్పించుకుంది. అలాగే తన ఫస్ట్ సెలబ్రిటీ ఇంటర్వ్యూ కూడా నాగార్జున గారితోనే అనే విషయాన్ని కూడా వెల్లడించారు. యూట్యూబర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ బిగ్ బాస్ హౌస్ లో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
































