దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం డెంగ్యూ బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే డెంగ్యూ బారిన పడిన వాళ్లు ప్రాణాలు కోల్పోతే అవకాశం ఉంటుంది. డెంగ్యూ బారిన పడ్డ వాళ్లలో ప్లేట్ లెట్స్ క్రమంగా తగ్గిపోతాయి. ఒక అంచనా ప్రకారం భారత్ లో జనవరి నుంచి సెప్టెంబర్ నెల వరకు 16,439 మందికి డెంగ్యూ నిర్ధారణ అయింది. అయితే డెంగ్యూ నిర్ధారణ అయిన వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకునే ఛాన్స్ ఉంటుంది.

బొప్పాయి పండ్ల యొక్క ఆకుల రసం డెంగ్యూ రోగులపై సమర్థవంతంగా పని చేస్తుంది. బొప్పాయి ఆకుల రసంతో పాటు బొప్పాయిని తీసుకున్నా డెంగ్యూ రోగులకు ప్రయోజనం చేకూరుతుంది. బొప్పాయి ఆకులను తీసుకుని నీటిలో కలిపి బ్లెండర్ లో వేసి సులభంగా బొప్పాయి జ్యూస్ ను తయారు చేసుకోవచ్చు. డెంగ్యూ బారిన పడ్డవాళ్లలో బొప్పాయి రసం తక్కువ సమయంలోనే జ్వరాన్ని తగ్గిస్తుంది.
శరీరంలో ప్లేట్ లెట్ కౌంట్ ను క్రమంగా పెంచడంలో సహాయపడుతుంది. పోషకాలు ఎక్కువగా లభించే వెజిటేబుల్ జ్యూస్ కూడా ప్లేట్ లెట్స్ కౌంట్ ను పెంచుతుంది. వెజిటేబుల్ జ్యూస్ కు నిమ్మరసం యాడ్ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. అల్లం, ఇలాచీ, దాల్చిన చెక్కతో తయారు చేసిన హెర్బల్ టీ మైండ్ ను రిఫ్రెష్ చేయడంలో సహాయపడుతుంది. వేపాకు జ్యూస్ కూడా ప్లేట్ లెట్స్ కౌంట్ ను పెంచడంలో సహాయపడుతుంది.
డెంగ్యూ బారిన పడ్డవాళ్లు పసుపుతో తయారైన ఆహార పదార్థాలను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆమ్లా ప్లేటెలెట్స్ ఫార్మేషన్ కు సహాయపడటంతో పాటు క్రానిక్ కండిషన్స్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జలుబు, జ్వరం తగ్గించడంలో సహాయపడతాయి.































