బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి.. తన భర్త ఓ ప్రముఖ వ్యాపార వేత్త అయినా రాజ్ కుంద్రా గతనెల అశ్లీల వీడియోలను తీసి వాటిని యాప్స్ లో అప్లోడ్ చేస్తూ లక్షలకు లక్షలు డబ్బులు సంపాదిస్తున్నారని అభియోగం రావడంచేత ఆయనని ముంబై పోలీసులు అరెస్టు చేయగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఒక్కసారిగా రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు బయటపడటంతో బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయింది.

ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతనికి బెయిల్ దొరకలేదు.అయితే తన భర్త ఈ విధమైనటువంటి వీడియోలను చిత్రీకరించి డబ్బులు సంపాదిస్తున్నారనే విషయం తెలియని శిల్పాశెట్టి ఈ విషయం బయటపడటంతో ఒక్కసారిగా షాక్ అయింది. ఈ క్రమంలోనే ఈ కేసులో తనకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఈమెను కూడా విచారించారు.

తాజాగా తన భర్త చేసిన పనికి తన వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావం పడుతుందని భావించిన శిల్పాశెట్టి తన నుంచి విడిపోయి తన పిల్లలతో కలిసి ఒంటరిగా జీవించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను ఈ విధంగా సంపాదించిన డబ్బును తాను తాకకూడదని అందుకే తన నుంచి విడిపోయి ఒంటరిగా జీవించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తన భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించడానికి సిద్ధపడిన శిల్పాశెట్టి తిరిగి సినిమాలలో నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే అనురాగ్ బసు, ప్రియదర్శన్ వంటి దర్శకులు తమ సినిమాలలో ఈమెకు అవకాశం కల్పించినట్లు సమాచారం.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శిల్పాశెట్టి తన భర్త పోర్నోగ్రఫీ విషయం బయట పడిన తర్వాత మోటివేషనల్ పోస్టులు పెడుతున్నారు. మరి నిజంగానే శిల్పాశెట్టి తన భర్త నుంచి విడాకులు తీసుకుంటుందా లేదా అనే విషయాన్ని శిల్పాశెట్టి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.































