బాలీవుడ్ ప్రేమపక్షులు కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ జంట డిసెంబర్ 9 వ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు.ఇలా వీరిద్దరి వివాహం చేసుకోబోతుండగా వీరి గురించి పలువురు కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పలు సినిమాల్లో కలిసి నటించే సమయంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఏర్పడి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.

కానీ కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ఇద్దరు ఏ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. కానీ ఈ జంట ప్రేమలో ఎలా పడ్డారు అని పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కరణ్ జోహార్ టాక్ షోనే కారణమని తెలుస్తోంది. 2019 ఎపిసోడ్‌లో, కరణ్ తన తదుపరి ప్రాజెక్ట్‌లో ఎవరితో కలిసి పని చేయాలని భావించారు అంటూ కత్రినా అని ప్రశ్నించగా అందుకు ఆమె టక్కున దివా విక్కీ పేరు చెప్పడం గమనార్హం.

ఇలా టాక్ షోలో పాల్గొన్న వీరు వారి కుటుంబ సభ్యుల గురించి, వారి కెరియర్ గురించి చర్చించుకున్నారు.ఇలా ఎప్పుడూ కలవని, కలిసి పనిచేయని వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి ఈ షో కారణమైందని చెప్పవచ్చు. ఇలా వీరిద్దరూ అప్పటి నుంచి పలు సందర్భాలలో కలిసి మీడియా కంట పడటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న వీరు ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నట్లు అందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇలా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కరణ్ జోహార్ షో కారణమని చెప్పవచ్చు.

































