Connect with us

devotional

గుడికి వెళ్ళినప్పుడు ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో తెలుసా..?

Published

on

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయాన్ని సందర్శించినప్పుడు మొదటగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు పూర్తిచేసిన తరువాత ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకుంటాను. అయితే కొందరు దేవుడి ఆలయం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలో పూర్తిగా అవగాహన ఉండదు. వారికి తోచిన విధంగా 3,5,7,9 ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తారు. మరికొందరు ప్రత్యేకమైన కోరికలు కోరుకొని స్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం మనం చూసే ఉంటాం. అయితే ఏ దేవుడి గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement

సూర్య భగవానుడికి, నవగ్రహాలకు,18 ప్రదక్షిణాలు చేయాలి. అదేవిధంగా సుబ్రమణ్యేశ్వర స్వామికి,27 ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి జరుగుతుంది.
*సోమవారం శివుడికి18 మహాలక్ష్మి అమ్మవారికి 20 ప్రదక్షిణలు చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
*మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ 21 ప్రదక్షణలు చేయాలి.
*బుధవారం సరస్వతీదేవికి17, వినాయకుడుకి 27 ప్రదక్షిణలు చేయాలి.
*గురువారం సాయిబాబా దేవాలయంలో 16 ప్రదక్షిణలు చేయాలి.
*శుక్రవారం దుర్గా మాత ఆలయంలో 20 ప్రదక్షిణలు చేయాలి.
*శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి 21 ప్రదక్షిణలు శనీశ్వరునికి 18 ప్రదక్షిణలు చేయాలి.

ఈ విధంగా ఇష్టమైన రోజు ఇష్టమైన దేవునికి ఇన్ని ప్రదక్షిణలు చేసి ఆలయంలోనికి దేవుని దర్శనార్థం ఆలయంలోనికి ప్రవేశించాలి. ఈ విధంగా ప్రదక్షిణలు చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా, అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

Advertisement

devotional

Lord Srikrishna Mistery : శ్రీ కృష్ణుడి ద్వారకానగరం నిజంగా ఉందా… సముద్రంలో దొరికిన ఆ పార్థివ దేహం కృష్ణుడిదేనా…!?

Published

on

Lord SriKrishna mistery : ‘వందే కృష్ణం జగద్గురుమ్, కృష్ణం వందే జగద్గురుమ్..’ ఇది కృష్ణుడిని ఆరాధించేవారు నమ్మే సిద్ధాంతం, ప్రపంచం మొత్తం కృష్ణుడిలోనే ఉంది శ్రీకృష్ణుడే ప్రపంచం. అయితే నిజంగా శ్రీకృష్ణుడు ఉన్నాడా లేక మన పురాణాల్లో పేర్కొన్నది కల్పిత కథా. దీనికి సంబంధించిన పరిశోధనలు అనేకం జరిగాయి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత నేడు మన ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతోంది. భగవద్గీత హిందువులకు మాత్రమే కాదు నేడు ప్రపంచంలో ఎంతో మంది శ్రీకృష్ణుడి భగవద్గీత భోధనలను అనుసరిస్తున్నారు. మహాభారతం విన్న ఎవరికైనా శ్రీ కృష్ణుడు మంచి వ్యూహకర్త అని అనిపిస్తుంది.

Advertisement

పురావస్తు తవ్వకాల్లో దొరికిన అస్థి పంజరం ఎవరిది…

మహాభారతం నిజమని కురుక్షేత్రం జరిగిన ఆధారాలు లభ్యం కావడంతో మన ఇతిహసం అయిన మహా భారతం కేవలం కల్పితం కాదు నిజం అని ప్రపంచానికి అర్థమైంది. ఇక ఎన్నో ఏళ్లుగా కృష్ణుడు ఏలిన ద్వారకా నగరం గురించి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక వాటి మీద పరిశోధనలు చేస్తూ గుజరాత్ వద్ద అరేబీయా సముద్రం ఒడ్డున భారత పురావస్తు శాఖ తవ్వకాలను నిర్వహించి అనేక విషయాలను కనుగొన్నారు. నిజంగా ద్వారకా నగరం ఉందని ఎన్నో ఆధారాలను కనుగొన్నారు. ఇండియన్ అర్కియాలజిస్ట్లు 2005 లో సముద్ర గర్భంలో తవ్వకాలు మొదలు పెట్టి 2009 లో ద్వారకా నగరానికి సంబందించిన అనేక అవశేషాలను కనుగోన్నారు.

అవి దాదాపు 9500 సంవత్సరాల క్రితం రాళ్లు అని తెలుసుకున్నారు. ఇక ఎన్నో పాత్రలు, నాణాలను పరిశోధకులు కనుగొన్నారు. సముద్రగర్భంలో 9000 ఏళ్ళ క్రితం నటి నాది ఆనవాళ్ళను కనుగొన్నారు. అంతే కాకుండా మహాభారతం కేవలం కల్పితమా లేక నిజంగా జరిగిందా అన్న పరిశోధనల్లో నిజమని నిరూపించే అనేక ఆధారాలను పరిశోధకులు కనుగొన్నారు. ఇక కురుక్షేత్ర సమయంలో మరణించిన ఒక పెద్ద అస్థిపంజరం ను పూరావస్తు శాస్త్రవేత్తలు సముద్రంలో కనుగోన్నారు. ఇక ఈ అస్థి పంజరం ఘటోత్కచుడి అస్థి పంజరం అని నిర్ధారించారు. ఇక కురుక్షేత్రం జరిగిన స్థలం హర్యానా రాష్ట్రంలోని ఒక ప్రాంతం, అక్కడ యుద్ధం జరగడం వల్ల ఎంతో మంది మరణించడం వల్ల రక్తంతో తడిసి అక్కడి మట్టి ఎర్రగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఇక మహా భారతంలో పేర్కొన్న నగరాలు నేటికీ ఉండటం మహాభారతం జరిగింది అనడానికి అలాగే శ్రీకృష్ణుడు ఉన్నాడు అనడానికి నిదర్శనాలుగా చెప్పవచ్చు.

Advertisement
Continue Reading

devotional

Mahesh Babu: మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. నమ్రత కూడా కాదంట తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

ఈ విధంగా రాజమౌళి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే మహేష్ బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈయన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరి సరసన నటించారు. ఈ క్రమంలోనే మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఈ హీరోయిన్లతో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకుంటారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ మళ్లీ మళ్లీ హీరోయిన్లతో షేర్ చేసుకోవాల్సి వస్తే షేర్ చేసుకుంటానని తెలిపారు. త్రిషతో నటించడం చాలా సులభంగా ఉంటుందని అంతేకాకుండా తనతో నా స్క్రీన్ స్పేస్ బాగుంటుందని తెలిపారు. ఇలా మా ఇద్దరి మధ్య సీన్స్ అద్భుతంగా ఉండడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అని ఈయన తెలిపారు.

ఫ్రెండ్షిప్ కారణం…
ఇక త్రిష తర్వాత సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తాను ఇష్టపడతానని తెలిపారు. అయితే ఈయన భార్య నమ్రత కూడా హీరోయినే, ఈమెతో కలిసి కూడా మహేష్ బాబు సినిమాలలో నటించారు కానీ ఈయన మాత్రం తన భార్య పేరు చెప్పకుండా త్రిష సమంత అంటూ తనకి ఇష్టమైనటువంటి హీరోయిన్లు మళ్లీమళ్లీ సినిమాలలో నటించాలనుకునే హీరోయిన్ల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

devotional

Donates: ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు కనుక ఇచ్చారో అప్పలపాలు అయినట్టే?

Published

on

Donates: సాధారణంగా మనం ఏదైనా పండుగల సమయంలోను లేదా ఎప్పుడైనా ఇతరులకు దానధర్మాలను చేస్తూ ఉంటాము. ఇలా ఇతరులకు మనం చేసే దానధర్మాల వల్ల వారు సంతోషించినప్పుడే మనం చేసిన దాన పుణ్యఫలం మనకు దక్కుతుంది. అందుకే పెద్ద ఎత్తున మన ఆర్థిక స్థోమతకు అనుకూలంగా దాన ధర్మాలను చేస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం మన ఇంటికి వచ్చిన వారికి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యానికి బదులు పాపం కలుగుతుంది.

Advertisement

ఇంటికి వచ్చినటువంటి వారికి మనం ఎప్పుడూ కూడా చిరిగిపోయిన బట్టలను అలాగే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలను లేదా లోహపు వస్తువులను పొరపాటున కూడా దానం చేయకూడదు. ఇలా ఈ వస్తువులు కనుక ఇచ్చాము అంటే దానం చేసిన పుణ్యఫలం ఏమో కానీ పెద్ద ఎత్తున పాపం రావడమే కాకుండా లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి ఉంటుంది.

పుణ్యం కలుగుతుంది..

అందుకే పొరపాటున కూడా ఇలాంటి వస్తువులను పేదవారికి గాని ఇతరులకు కానీ దానం చేయకూడదు ముఖ్యంగా కొబ్బరి నూనెను కూడా మనం ఇతరులకు ఎప్పుడు దానం చేయకూడదు. మనం ఇతరులకు పెట్టే ఆహార పదార్థమైన ఇచ్చే దుస్తులు వల్ల అయినా కూడా వారు సంతోషంగా ఉన్నప్పుడే ఆ దానం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరిసంపదలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!