Varun Sandesh: టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హ్యాపీ డేస్ చిత్రం ద్వారా పరిచయమై, ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు వరుణ్ సందేశ్. హ్యాపీడేస్ చిత్రం తరువాత పలు చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరుణ్ హీరోయిన్ వితికను వివాహం చేసుకున్నారు.

ఇలా వీరిద్దరూ కలిసి బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయినప్పటికీ ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తరువాత వితిక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ సందేశ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ మాట్లాడుతూ లైఫ్ లో సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఎప్పుడు ఒకే విధంగా ఉండాలని తెలిపారు.ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించానని మరికొన్ని సినిమాలు ఏ మాత్రం ప్రమోషన్ చేయకుండా విడుదల అయ్యాయని ఈ సందర్భంగా తెలిపారు.
వితిక అంటే చాలా గర్వపడుతాను…
ఇక తన భార్య వితిక గురించి మాట్లాడుతూ… తను డిజైనింగ్ కూడా చేస్తుందని వరుణ్ సందేశ్ ఈ సందర్భంగా తెలిపారు. బిగ్ బాస్ తర్వాత తను ఎన్నో నెగెటివ్ కామెంట్లను ఎదుర్కోవలసి వచ్చిందని, వాటిని చూసి వితిక చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ తెలిపారు. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోందని యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద మొత్తంలోనే సంపాదిస్తుందని వరుణ్ సందేశ్ పరోక్షంగా తెలిపారు. తనని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుందని తెలిపారు.వితిక తనకన్నా 5 సంవత్సరాలు చిన్నది.మాకు లైఫ్ లో కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అవి తీరే వరకు పిల్లలు వద్దని అనుకున్నట్లు ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ తెలిపారు.