అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సినిమాతో మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ ఒక మెయిల్ విలన్ గా పరిచయం కానున్నాడు. మలయాళం లో అతను స్టార్ యాక్టర్. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విభిన్న పాత్రల్లో నటించి తన కంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్నారు.

ఫహద్ నటించిన కొన్ని సినిమాలు కరోనా నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విడుదల అయ్యి ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చాయి. ఫహద్ కి తెలుగు సినిమాకి కాస్త కనెక్షన్ ఉంది. ఎలా అంటే ఫహద్ తండ్రి ఫాజిల్ తెలుగులో హీరో నాగార్జున నటించిన కిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఫాజిల్ మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులలో ఒకరు. అలా ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఫహద్. 2002లో కైయేతుమ్ దూరత్ అనే మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తరువాత వెనుతిరిగి చూసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. అలా 2011లో చాప్ప కురిషు సినిమాలో నటనకు గాను కేరళ ప్రభుత్వం నుంచి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇకపోతే పుష్ప సినిమాలో మెయిన్ విలన్ రోల్ కు సుకుమార్ మొదట విజయ్ సేతుపతిని ఎంచుకున్నారట.

మొదట ఈ సినిమాకు ఓకే చెప్పిన విజయ్ సేతుపతి ఆ తర్వాత పలు కారణాల వల్ల వదులుకున్నాడు. అలా బన్వర్ సింగ్ షెకావత్ ఐపీఎస్ క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేశారు ఫహద్. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ ను ఢీ కొట్టే పాత్రలో గుండుతో ఒక వైవిధ్యమైన లుక్ కనిపిస్తున్నాడు.

ఇకపోతే ఫహద్ మలయాళం తార నజ్రియా నజీమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నజ్రియా కూడా త్వరలోనే నాని సరసన కథానాయికగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం కానుంది.































