ఈ మధ్య కాలంలో నకిలీ నోట్ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొందరు నకిలీ నోట్లను తయారు చేసి చిన్నచిన్న వ్యాపారులకు వాటిని ఇచ్చి మార్కెట్ లోకి ఆ నోట్లు చలామణిలోకి వచ్చేలా చేస్తున్నారు. అయితే కొంతమందికి ఏకంగా ఏటీఎంలలోనే నకిలీ నోట్లు వస్తున్నాయి. చాలామంది ఏటీఎంలో నకిలీ నోటు వస్తే ఏం చేయాలో అర్థం కాని విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏటీఎంలో నకిలీ నోటు వస్తే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అసలు నోటును సులువుగా పొందవచ్చు.

ఏటీఎంలో నకిలీ నోటు వస్తే మొదట ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాకు ఆ నోటిని చూపించాలి. అలా చేయడం వల్ల మనం ఆ నోటును బ్యాంక్ ఏటీఎం నుంచే విత్ డ్రా చేశామని సులువుగా ప్రూవ్ చేయగలుగుతాం. నకిలీ నోటు వచ్చిన సమయంలో ఆ బ్యాంకుకు సెక్యూరిటీ గార్డ్ ఉంటే వెంటనే ఆ సెక్యూరిటీ గార్డుకు నోటుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి. అలా చేయడం ద్వారా మనకు ఏటీఎం ద్వారానే నకిలీ నోటు వచ్చిందని ప్రూవ్ చేయగలుగుతాం.

ఏటీఎంలో నకిలీ నోటు వచ్చిన సమయంలో బ్యాంక్ తెరిచి ఉంటే వెంటనే బ్యాంక్ మేనేజర్ ను సంప్రదించి ఆ నకిలీ నోటు గురించి సమాచారం ఇవ్వాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఏటీఎంల ద్వారా వచ్చే నకీలీ నోట్ల విషయంలో బ్యాంకులకు కీలక సూచనలు చేసింది. బ్యాంకులు అసలు నోటును ఇవ్వడానికి ఆలస్యం చేస్తే ఆ బ్యాంకుపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

చాలా సందర్భాల్లో తనిఖీ చేసిన తర్వాతే ఏటీఎంలలో నోట్లను ఉంచుతారు. అయితే కొన్ని సందర్భాల్లో సరిగ్గా తనిఖీ చేయకపోవడం వల్ల నకిలీ నోట్లు బ్యాంకును చేరతాయి. ఏటీఎం ద్వారా నగదును విత్ డ్రా చేసిన రశీదు కూడా ఉంటే సులువుగా బ్యాంకు ద్వారా అసలు నోటును పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here