మనం అమీర్ ఖాన్ సినిమాల్లో ఎక్కువగా చెప్పుకునే సినిమా.. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా తారే జమీన్ పర్. ఈ సినిమాకు అమీర్ ఖానే దర్శకుడిగా ఉన్నాడు. ఈ కథ మొత్తం ఓ మానసిక వికలాంగుడి చుట్టూ తిరుగుతుంది.

దీనిని అందంగా.. ప్రతీ ప్రేక్షకుడు వావ్ అనిపించేలే.. మనస్సుకు అత్తుకునే విధంగా అద్భుతంగా తెరకెక్కించాడు అమీర్ ఖాన్. ఇషాన్ అవస్తీ అనే కుర్రాడు మానసిక రుగ్మతతో బాధపడుతుంటాడు. అతడి పాత్రలోనే దర్శీల్ సఫారి నటించాడు. ఈ సినిమా బంపర్ హిట్ అయింది. కానీ ఇందులో బాలుడిగా నటించిన దర్శీల్ కు మాత్రం ఆఫర్లు రాలేదు.
అయితే అతడు చదువుపై శ్రద్ధ వహించడంతో ఇటు ఆఫర్లు తగ్గాయనేది తెలుస్తోంది. అయితే అతడి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతడికి 23 ఏళ్లు వచ్చాయి. చిన్న తనంలో చేసింది ఈ కుర్రాడేనే అనే విధంగా మారాడు ఈ దర్శీల్. ఈయన కొత్త ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తారే జమీన్ పర్ సినిమా తన జీవితాన్ని మార్చేసిందని.. అప్పటి నుంచే తాను సెలబ్రిటీ అయిపోయానని అంటున్నాడు దర్శీల్.
ఎవరికీ తాను తారసపడినా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారని.. స్కూల్లో కూడా సెల్ఫీ ఫొటోలు దిగారని చెప్పాడు. అయితే ఆ సినిమా తర్వాత తాను భం భం భోలే, జొక్కొమోన్ సినిమాల్లో నటించినట్లు చెప్పాడు. అప్పటికీ ఇప్పటికీ తాను ఏం మారలేదని.. కాకపోతే పరిస్థితులు మారిపోయాయని చెప్పాడు.
































