అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ట్రంప్ కు కరోనా నిర్ధారణ కావడంతో ఆయన మద్దతుదారుల్లో టెన్షన్ పెరుగుతోంది. మరోవైపు నిన్న సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ట్రంప్ ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ అనేక వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ట్రంప్ నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు.

శుక్రవారం ట్రంప్ ఆక్సిజన్ లెవెల్స్ 94 శాతం కంటే తగ్గగా వైద్యులు ఆయనకు ఆక్సిజన్ అందేలా చేశారు. రెండుసార్లు ట్రంప్ కు ఆక్సిజన్ అందేలా చేసినట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ కరోనా నుంచి కోలుకున్నాడని ఆయనలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని సమాచారం. ట్రంప్ కు చికిత్స లో భాగంగా రెమిడెసివర్ ఔషధాన్ని ఇచ్చారు. ఈ ఔషధం ఇచ్చిన తరువాత అవయవాల పనితీరు సాధారణ స్థాయికి చేరుకుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

ట్రంప్ నిన్న ఒక వీడియో విడుదల చేసి తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆస్పత్రిలో చేరినప్పటి కంటే ఆరోగ్యం క్రమంగా మెరుగైందని వెల్లడించారు. ఖచ్చితంగా వైరస్ ను మట్టి కరిపిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే వైద్య సిబ్బంది మాత్రం ట్రంప్ ను డిశ్చార్జ్ చేసినా ఆయనకు ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని మాత్రం తాము చెప్పలేమని చెబుతున్నారు. ట్రంప్ భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయినట్టు సమాకారం.

ప్రస్తుతం ట్రంప్ అక్సిజన్ లెవెల్స్ 96 నుంచి 98 శాతం ఉండగా జ్వరానికి సంబంధించిన లక్షణాలు కనిపించడం లేదు. మరోవైపు త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ట్రంప్ బృందం ప్రచారానికి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టింది. ట్రంప్ తరపున ఆయన కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి ప్రచారాన్ని నిర్వహించనున్నారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here