ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ చివరకు అమెరికా అధ్యక్షుడికి సైతం సోకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి మిలియన్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 74 సంవత్సరాల వయస్సులో ట్రంప్ కు కరోనా నిర్ధారణ కావడంతో ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా వృద్ధులకు కరోనా వైరస్ సోకితే ప్రమాదమనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏడు పదుల వయస్సులో ఉన్న ట్రంప్ బరువు 110 కిలోలు. సాధారణంగా ఉండాల్సిన బరువుతో పోల్చి చూస్తే ఈ బరువు చాలా ఎక్కువ. కరోనా సోకిన వాళ్లకు అధిక బరువు మరీ ప్రమాదకరం. అధిక బరువు వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ముప్పు. వయస్సు పై బడిన వాళ్లు, ఊబకాయంతో బాధ పడే వారు ఆస్పత్రిలో చేరినా కోలుకునే అవకాశాలు తక్కువ.

6 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉండే ట్రంప్ హై రిస్క్ గ్రూపులో ఉన్నారు. మరోవైపు కరోనా ముప్పు పురుషుల్లోనే ఎక్కువ. ట్రంప్ రక్తపోటు సమస్యతో కూడా బాధ పడుతున్నారు. మరోవైపు ట్రంప్ తో పోల్చి చూస్తే మెలానియా ట్రంప్ కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆమె వయస్సు ప్రస్తుతం 50 సంవత్సరాలు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. అయితే ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడిందని ఆ సమస్య పూర్తిగా తగ్గిందో లేదో తెలియదని వైద్య వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలని ఆ దేశానికి చెందిన ప్రజలు భావిస్తున్నారు. ట్రంప్ కు కరోనా సోకడంతో చైనా ఆనందం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here