పూర్వం మన పెద్ద వాళ్లు భోజనం చేసిన తర్వాత కొన్ని పనులు చేయకూడదని హెచ్చరిస్తుంటారు.భోజనం తర్వాత కొన్ని పనులను చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి తద్వారా కొన్ని పనులు చేయకూడదని మన పెద్దవారు హెచ్చరించే వారు. ప్రస్తుతం నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. చాలా మందికి భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయడం అలవాటు ఉంటుంది. పొరపాటున కూడా భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే స్నానం చేయటం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఇబ్బందులు తలెత్తుతాయి. తద్వారా కడుపులో మంట, గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక భోజనం చేసిన తర్వాత ఒక గంట వరకు స్నానం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలా మందిలో ఉన్న అతి పెద్ద సమస్య ఇది. భోజనం చేసిన వెంటనే చాలామంది పడుకుంటారు. అయితే భోజనం చేసి పడుకోవడం ద్వారా తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుందని భావిస్తారు. అయితే తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఆహారం జీర్ణం కాకపోవడమే కాకుండా, మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా తిన్న వెంటనే కొందరు వ్యాయామం చేస్తుంటారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు.

భోజనం చేసిన తర్వాత కొందరికి కాఫీలు, టీలు తాగే అలవాటు ఉంటుంది. భోజనం చేసిన వెంటనే కాపీ కూడా తాగకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. భోజనం చేసిన తరువాత కాసేపటికి కాఫీ టీ తాగాలని అదేవిధంగా భోజనం చేసిన పది నిమిషాల తర్వాత వాకింగ్ చేయడం వంటివి చేయడం ద్వారా ఎలాంటి సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా పడుకోవడానికి గంట ముందు భోజనం చేయాలి. రాత్రి సమయంలో కూడా భోజనం చేసిన అరగంట తర్వాత పడుకోవడం వల్ల జీర్ణక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here