బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక బిగ్ బాస్ రియాలిటీ షో కి తెలుగులో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాలుగు సీజన్లను పూర్తిచేసుకొని ఐదవ సీజన్ ప్రసారమవుతుంది.ఇక నాలుగవ సీజన్లో భాగంగా గుజరాతి అమ్మాయిగా అందరికీ పరిచయమైన కంటెస్టెంట్ మోనాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె బిగ్ బాస్ సీజన్ ఫోర్ హౌస్ లోకి అడుగుపెట్టి తనదైన శైలిలో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ చివరి వరకు హౌస్ లో ఉండి విశేష ఆదరణ దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మొదట్లో ఈమె అభిజిత్ తో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత అఖిల్ తో లవ్ ట్రాక్ నడిపింది.ఒకానొక సమయంలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ ఎన్నో కార్యక్రమాలు ద్వారా ఎంతో బిజీగా మారారు.ఇక ఈమె అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో ఏకంగా ఐటమ్ సాంగ్ లో నటించే అవకాశాన్ని దక్కించుకుని కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే మోనాల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తుంటారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండే ఈమె పట్ల కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే డ్రామా క్వీన్ అంటూ ఈమె గురించి నెగిటివ్ కామెంట్ చేయడంతో ఈ కామెంట్లపై స్పందించారు. రేయ్ పిచ్చిపిచ్చిగా ఉందా నాకు ఫ్యామిలీ ఉంది ఈ పిచ్చి కామెంట్స్ ఏంటి మీకు అసలు కామన్సెన్స్ లేదు నన్ను ఫాలో కావడం ఇష్టం లేకపోతే అన్ ఫాలో అవ్వండి అంతేకానీ ఇలా పిచ్చి కామెంట్స్ తో మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఈమె గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇలా మోనాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
































