Actor Nirupam: షాపింగ్ అనే పేరు వినబడితే చాలు అమ్మాయిలకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. ఓపిక లేకపోయినా గంటలతరబడి షాపింగ్ చేయాలంటే అమ్మాయిలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఇలా నిత్యం ట్రెండ్ కి అనుగుణంగా బట్టలు నగలు కొనుగోలు చేస్తూ ఉంటారు.ఇకపోతే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున షాపింగ్ చేయడమే కాకుండా ఆ షాపింగ్ కి సంబంధించిన వీడియోని వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ ఉన్నారు.

కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిరుపమ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న నిరుపమ్ ఏకంగా డాక్టర్ బాబుగా అందరికీ గుర్తుండిపోయారు.ఇకపోతే ప్రస్తుతం ఈ సీరియల్ నుంచి ఈయన దూరం కావడంతో ఎంతో మంది అభిమానులు ఇతని చాలా మిస్ అవుతున్నారని చెప్పాలి.

ఇలా బుల్లితెర సీరియల్స్ కి దూరమైన ఈయన తన భార్యతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే ఇప్పటికే ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకునే వీళ్ళు తాజాగా సత్యనారాయణ స్వామి వ్రతం ఉందని చెప్పి షాపింగ్ కోసం వెళ్లారు. ఈ క్రమంలోనే డాక్టర్ బాబు భార్య మంజుల ఏకంగా తన భర్త చేత ఏడువారాల నగలు కొనిపించింది.
షాపింగ్ పిచ్చి ఎప్పటికీ తగ్గదు….
ఏడు వారాల నగలంటే పూర్తిగా బంగారంతో కూడినవి కాదు.92.5 స్వచ్ఛమైన వెండితో తయారైన బంగారు ఆభరణాలకు బంగారం పూసి తయారు చేశారు. ఇలా బంగారం పూత పూసిన ఏడువారాల నగలు మంజుల భర్త చేత కొనిపించారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇలా భార్యకు ఏడువారాల నగలు కొనిచ్చిన డాక్టర్ బాబు అమ్మాయిలకు షాపింగ్ పిచ్చి ఎప్పటికి తగ్గదు అంటూ కామెంట్ చేశారు.

































