భారత్ లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. దేశంలో ప్రతిరోజూ 70,000కు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను కట్టడి చేసే అవకాశాలు ఉంటాయి. ఇదే సమయంలో కరోనాకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నోటిపూత కరోనా లక్షణమే అని చెప్పిన వైద్యులు ప్రస్తుతం నోట్లో దద్దుర్లు కూడా కరోనా లక్షణమేనని ఈ లక్షణం కనిపిస్తే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ముక్కు లేదా నోటి ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే నాలుక మీద బొడిపెలు కనిపిస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్పెయిన్ డాక్టర్లు 666 మంది కరోనా సోకిన రోగులపై అధ్యయనం చేసి నోటి దద్దుర్లు కూడా కరోనా లక్షణమేనని కనిపెట్టారు. కరోనా బారిన పడ్డ కొంతమంది రోగుల్లో రక్తహీనత కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
 
666 మంది రోజుల్లో 26 శాతం మంది రోగులలో ఈ లక్షణాలను గుర్తించామని.. తెలుపు, ఎరుపు రంగుల్లో చిన్న బొడిపెలు నాలికపై కనిపించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో పాటు నోట్లో బొడిపెలు కూడా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ రాషెస్ కరోనా రోగుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయని కొందరిలో కరోనా నుంచి కోలుకున్న తరువాత కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
 
మరోవైపు కరోనా సోకిన రోగుల్లో వాసనకు సంబంధించిన లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తాయని వైద్యులు తెలుపుతున్నారు.వాసనను పీల్చుకునే నరాలను వైరస్ బ్లాక్ చేయడం వల్ల ఈ సమస్య కనిపిస్తుందని.. వాసన పూర్తిగా తెలియకపోవడాన్ని పారోస్మియా అంటారని.. సగం వాసన తెలియడాన్ని అనోస్మియా అంటారని.. వాసన, రుచి చాలాకాలంగా తెలియకపోతే దానిని ఫాంటోస్మియా అంటారని వెల్లడించారు.ఈ లక్షణం కూడా కరోనానే.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్య నిపుణులు..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here