వేసవి కాలం ప్రారంభం అవడంతో మండే ఎండలతోపాటు అనేక సమస్యలను వెంట తీసుకువస్తుంది. ముఖ్యంగా బయటి ప్రదేశాల్లో పనిచేసేవారు చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. వేడి వాతావరణం కారణంగా శరీరంలోని తేమ ఆవిరై డీ-హైడ్రేషన్ కు గురవుతారు. డీహైడ్రేషన్ నుంచి విముక్తి పొందడం కోసం ఎన్నో శీతల పానీయాలను తీసుకుంటారు.వీటిని తీసుకోవడం వల్ల దాహం తీరడం ఏమో కానీ, తర్వాత అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పంచదార, ఉప్పు కలిపిన నీటిని తాగితే వెంటనే ఉపసమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. శరీర ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల లేదా అంత కన్నా ఎక్కువ ఉండటాన్ని వడదెబ్బతగలడం అంటారు. దాంతో శరీరం డీ-హైడ్రేషన్ కి గురవుతుంది. ఈ సమయంలో తలనొప్పి, వాంతులు, అలసట, బలహీనంగా అవటం, కండరాల తిమ్మిరులు మరియు కళ్ళు తిరగటం లక్షణాలుగా కనపడతాయి.హార్ట్ స్ట్రోక్ కి కూడా కారణమయ్యే అవకాశం ఉంది.

వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

  • వేసవిలో మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి రెండుసార్లు స్నానం చేయడం మంచిది. మరి చల్లగా ఉన్న నీటిని స్నానానికి వాడితే హఠాత్తుగా శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. కావున స్నానానికి గోరు వెచ్చని నీటి వాడడం మంచిది.
  • వేసవిలో మనం సహజంగా రోజుకు 7-8 లీటర్ల నీళ్లు తాగడం మంచిది అలాగే ప్రకృతి సిద్ధంగా దొరికే తాజా పళ్ళ రసాలను, మజ్జిగ తీసుకోవడం మరీ మంచిది.
  • వేసవిలో ఎక్కువగా సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. కావున సాధ్యమైనంత వరకు ఉదయం పది గంటలలోపు సాయంత్రం ఐదు తర్వాత బయటికి వెళ్లడం మంచిది ఇది.

*వేసవిలో ముఖ్యంగా జంక్ ఫుడ్, ఆల్కహాల్, అధిక మసాలా ఉన్న ఆహారం, కెఫీన్ శరీరంలో వేడికి కారణమవుతాయి. కాబట్టి వీటికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here