మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవలే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిన్న ఉదయం బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజగా పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు ఈటల రాజేందర్ బృందం. ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయమనైన ఈటల బృందం పయనిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది.

దీంతో సకాలంలో పైలట్ అలెర్ట్ అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించాడు పైలట్. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఈటల బృందంనేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ సమయంలో ఈ ఘటన జరిగింది.


































