బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధిక రేటింగ్స్ దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి ఉన్న ఫాలోయింగ్ మరే షో కి లేదని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం మొదటి రోజులలో కొన్ని విమర్శలు తలెత్తిన ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో నవ్వులు వెల్లివిరుస్తాయి.

జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతోమంది ఆర్టిస్టులను ప్రస్తుతం సినిమాల్లో కూడా నటించే స్థాయికి తీసుకెళ్లింది. వారంలో రెండు రోజులు జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ పేర్లతో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి యాంకర్ లుగా రష్మి, అనసూయ వ్యవహరిస్తున్నారు.అదేవిధంగా జడ్జిగా మొదట్లో నాగబాబు, రోజా ఉన్నప్పటికీ నాగబాబు కొన్ని కారణాలవల్ల ఈ షో నుంచి తప్పుకున్నారు. అయితే నాగబాబు స్థానంలో సింగర్ మనోవచ్చినప్పటికీ ఈ షోకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.

మరొక జడ్జి రోజా తాజాగా అనారోగ్య కారణాల వల్ల తాత్కాలికంగా విరామం తీసుకోవడంతో రోజా స్థానంలో నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.జడ్జ్ గా ఇంద్రజకి ప్రారంభం నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా తన నవ్వులతో ఆడియన్స్ ను ఫిదా చేస్తోంది. జబర్దస్త్ షోలో వచ్చే కామెడీ కన్నా ఈమె నవ్వు కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు.

ప్రతి ఎపిసోడ్ ప్రోమో ప్రారంభంలో ఇంద్రజ నవ్వులకు ఓట్లు అడగగా వేల సంఖ్యలో ఓట్లు వచ్చేవి, మరికొందరైతే జడ్జిగా ఇంద్రజ వ్యవహరిస్తే ఎంతో బాగుంటుందని కామెంట్లు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తక్కువ కాలంలోనే ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఇంద్రజ నవ్వులకు వేల సంఖ్యలో లైక్స్ రావటం ఎంతో విశేషం. ఈ క్రమంలోనే ఇంద్రజ ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే రోజా పోస్ట్ కి దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యంతో కొన్ని రోజుల పాటు వదిలేసిన రోజాను తిరిగి ఈ షోకు జడ్జీగా తీసుకు వస్తారా? లేక తక్కువ సమయంలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఇంద్రజను వదిలేస్తారా? అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here