తమిళ స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న శంకర్ ఈ ఏడాది జూన్ లో తన పెద్ద కూతురు పెళ్లి రోహిత్ దామోదరన్ అనే వ్యక్తితో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇతను ఒక తమిళ క్రికెట్ క్లబ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా శంకర్ అల్లుడు రోహిత్ పై లైంగిక వేధింపులు కేసు నమోదయింది. ఈయన 16 సంవత్సరాల అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు రావడమే కాకుండా ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఇతనితో పాటు మరో ఐదుగురిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గతంలో ఈ అమ్మాయి క్రికెట్ కోచింగ్ కు వెళ్ళిన సమయంలో తనను లైంగికంగా ఎంతో వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. కేవలం లైంగిక వేధింపులు మాత్రమే కాకుండా ఈ విషయాన్ని బయట ఎక్కడైనా తెలియజేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సదరు బాలికను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఇలా శంకర్ అల్లుడు రోహిత్ దామోదరన్ పై ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక శంకర్ విషయానికి వస్తే ఇతను ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.































