సాధారణంగా ఈ ఏలియన్స్ గురించి మనం ఎన్నో సినిమాలలో చూస్తూ, వినే ఉంటాం. ఈ ఏలియన్స్ గురించి ఎన్నో ఏళ్లుగా అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ అనంతమైన విశ్వంలో భూమిను పోలి ఉన్న మరిన్ని గ్రహాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు.భూమి ని పోలి ఉన్న గ్రహాలు ఉంటే భూమిపై నివసించేటటువంటి ప్రాణకోటి ఆ గ్రహాలలో ఉండవచ్చనే అనుమానంతో ఎన్నో అధునాతనమైన పరికరాలను ఉపయోగించి శాస్త్రవేత్తల అనేక ప్రయోగాలు చేశారు.

భూమిలాంటి గ్రహాలు ఈ విశ్వంలో ఉన్నప్పటికీ, మనుషులను పోలిన గ్రహాంతర జీవులను మాత్రం గుర్తించలేకపోయారు. ఈ అనంత విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని అప్పట్లో ఎన్నో కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే మనం నివసిస్తున్న ఈ గ్రహంపై తప్ప ఇంత తెలివైన జీవులు ఉండే అవకాశం లేదంటూ నాసా తెలియజేసింది.తాజాగా, ఏలియన్స్ గురించి ఇజ్రాయెల్‌ అంతరిక్ష భద్రత విభాగం మాజీ జనరల్ హైమ్ ఎషెడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రహాంతరవాసుల ఉనికి నిజమేనని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా, ఏలియన్స్ ప్రజల్లోనే కలిసిపోయి తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. అలాగే, అమెరికా, ఇజ్రాయెల్‌తో ఏలియన్స్ ఎన్నో ఏళ్లుగా కలసి పని చేస్తున్నారనే సంచలన విషయాలను హైమ్ ఎషెడ్ బట్టబయలు చేశారు. అంతేకాకుండా భూమిపై ఏలియన్స్ గురించి ప్రయోగాల నిర్వహణకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

అచ్చం భూమిని పోలి ఉన్న అంగారక గ్రహంలో ఓ అండర్ గ్రౌండ్ స్థావరం కూడా ఉందని. అందులో అమెరికన్ వ్యోమగాములు, ఏలియన్ ప్రతినిధులు ఉన్నారని హైమ్ ఎషెడ్ వెల్లడించారు. ఈ విషయం గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా తెలుసని హైమ్ ఎషెడ్ ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here