ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క రంగంలో మహిళలు పురుషులతో పోటీపడి అన్ని రంగాలలో విజయం సాధించి తమదైన గుర్తింపు సాధిస్తున్నారు.ఇలా అన్ని రంగాలలో మహిళలు మకుటంలేని మహారాణిగా పేరు సంపాదించుకున్నప్పటికీ కేవలం అత్తింట్లో నిస్ససహాయకురాలుగా మారిపోతుంది. ఎంతోమంది మహిళలు అత్తింటి వేధింపులు భరించలేక చివరికి తమ నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగిస్తూ తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కేరళలో చోటుచేసుకుంది. అత్తవారు పెట్టే చిత్ర హింసలు భరించలేక కేరళలోని కోళికోద్ కు చెందిన నౌజిషా అనే మహిళ నిత్యం తన అత్తమామలతో, భర్తతో గొడవలు పడుతూ భర్త చేతిలో తన్నులు తినేది. ఇలా అత్తింటివారి వేధింపులులతో విసిగిపోయిన నౌజిషా బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళింది. అయితే తన కళ్ళల్లో అభం శుభం తెలియని తన కొడుకు కనిపించడంతో.. తాను మరణిస్తే తన బిడ్డ బతుకునాశనం అవుతుందని భావించి ఆత్మహత్య ఆలోచనను విరమించుకుంది.
ఇలా ఆత్మహత్య ఆలోచన నుంచి బయటకు వచ్చిన నౌజిషా తన కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లి కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూనే… పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికి కోచింగ్ తీసుకుంటూ 2018 సంవత్సరంలో పోలీస్ ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఫిజికల్ టెస్ట్ కి హాజరు కాలేక పోయింది. అయితే ఏ మాత్రం నిరాశ చెందకుండా 2020 సంవత్సరంలో మరోసారి పరీక్షలు రాసి ఎంతో విజయవంతంగా ఫిజికల్ టెస్ట్ లలో పాల్గొన్న నౌజిషా ప్రస్తుతం ట్రైనీ పోలీస్ ఆఫీసర్ గా విధుల్లో చేరారు.
ఇలా ఆత్మహత్య చేసుకోవాలని భావించిన నౌజిషా నేడు ఎంతో ఉన్నతమైన పోలీస్ ఆఫీసర్ వృత్తిలో ఉంటూ ఎంతోమంది మహిళలకు అద్భుతమైన సలహాలను సూచనలను ఇస్తుంది. అత్తవారింట్లో మీ పై జరిగే వేదింపులకు మౌనం వహించండి.. మీపై జరుగుతున్న అన్యాయం పై నోరు విప్పండి అంటూ మహిళలకు సూచనలు ఇస్తుంది. ఒకప్పుడు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులు దగ్గరకు వెళ్ళిన నౌజిషా నేడు అదే పోలీసు ఉద్యోగంలో ఉండి ఎందరికో ఆదర్శంగా నిలబడింది.































