Kajal Aggarwal Pregnancy: కాజల్ అగర్వాల్ కు పెళ్లైన కొన్ని నెలల తర్వాతనే ఆమె ప్రెగ్నెన్సీ ఆంటూ వార్తలు వచ్చాయి. కానీ వాటిపై అప్పుడు ఎలాంటి క్లారిటీ లేదు.. అది కాక వాళ్లు కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే ప్రస్తుతం ఆమె గర్భవతి అంటూ.. కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు.

గత ఏడాది అక్టోబర్‌లో తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న కాజల్.. తాజాగా ఓ బిడ్డకు జన్మనిస్తుంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా.. వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ లో గౌతమ్, కాజల్ కు సంబంధించి ఓ ఫొటోను షేర్ చేస్తూ.. “ఇదిగో 2022.. నిన్నే చూస్తున్నా..” అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఆ క్యాప్షన్ తర్వాత ప్రెగ్నెన్సీకు సంబంధించిన ఎమోజీలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టు చూడగానే ఆమె అభిమానులతో పాటు.. నెటిజన్లు అభినందనలు తెలియజేయడంతో కామెంట్ బాక్సులో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఇక కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గతంలోనే ఆమె గర్భంతో ఉన్నానని.. ఆచార్య నిర్మాతలకు తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్‌ని వీలైనంత త్వరగా ముగించే ఆలోచనలో కూడా ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇండియన్ 2 నుంచి తప్పుకున్న కాజల్..?
అయితే అప్పుడు ఈ విషయం ఆమె వాళ్లకు చెప్పిందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం వాళ్లు కన్ఫామ్ చేసేశారు. చిరంజీవి సరసన కాజల్.. ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె తదుపరి చిత్రం ఇండియన్ 2.. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి. క్వీన్ రీమేక్ “పారిస్ పారిస్”లో కూడా ఆమె నటిస్తోంది. మహమ్మారి కారణంగా ఈ రెండు సినిమాలు ఇప్పటికే రెండేళ్లకు పైగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం, కాజల్ చిరంజీవి ఆచార్య, హే సినామిక , వెంకట్ ప్రభు వెబ్ సిరీస్‌లతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు.































