Ghajani: పాన్ ఇండియా స్థాయిలో గజిని సీక్వెల్… అరవింద్ ప్లాన్ మామూలుగా లేదుగా?

0
19

Ghajani: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా ఆసిన్ నయనతార హీరోయిన్లుగా నటించిన చిత్రం గజినీ. డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా హీరో సూర్యకు తెలుగులో కూడా భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు.

ఇక ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో హిట్ కావడంతో హిందీలో కూడా రీమేక్ చేశారు. ఇలా ఎంతో సూపర్ హిట్ అందుకున్నటువంటి ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం చేయాలన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గత కొద్ది రోజుల క్రితం ఆయన బయటపెట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకేక్కించే ఆలోచనలో నిర్మాత అల్లు అరవింద్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో హీరో సూర్య నటించడానికి ఆసక్తి కనబరచడం లేదట. ఇలా సూర్య ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి కనబరచని నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.ఇక అమీర్ ఖాన్ కూడా హిందీలో గజినీ సినిమా చేసి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.

Ghajani: అమీర్ ఖాన్ హీరోగా…


ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో సూర్య ఆసక్తి కనబరచకపోవడంతో సీక్వెల్ చిత్రంలో అమీర్ ఖాన్ ను హీరోగా పెట్టి సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలు తెలియజేయనున్నారు.