Ghantasala: అమర గాయకుడు ఘంటసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన పాటలు పాడితే మనసంతా పులకించిపోతుంది ఎలాంటి బాధలో ఉన్న ఆయన స్వరం వింటే మనసు తేలిక అవుతుంది. ఇలా సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఘంటసాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయనకు ఇద్దరు భార్యలు అనే విషయం చాలా మందికి తెలియదు ఘంటసాల రెండవ భార్య సరల కుమారుడు రవి కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రవికుమార్ ఘంటసాల మరణం గురించి, ఆయన చివరి కోరిక గురించి తెలియజేశారు.
నాన్నగారికి మానస సరోవరం యాత్ర వెళ్లాలని ఎప్పటినుంచో ఉండేది అయితే ఆయన ఆ కోరిక నెరవేరకుండానే మరణించారు. అయితే నాన్నగారి కోరికను తీర్చడం కోసం తన తల్లి సరళ మానస సరోవరం యాత్ర ప్రారంభించిందని తెలిపారు. ఇలా తన తల్లి మానస సరోవర యాత్ర వెళ్ళినప్పుడు తన యాత్రకు సంబంధించిన అన్ని విషయాలను ఫోన్ చేసి మాకు తెలియజేస్తుంది.

Ghantasala: యాత్ర పూర్తి చేసి శాశ్వత నిద్రలోకి వెళ్ళింది…
ఈ విధంగా యాత్ర పూర్తి అయిన తర్వాత తాను యాత్ర పూర్తి చేసుకున్నానని మాకు తెలియజేసి అందరికీ బాయ్ చెప్పి టెంట్ లోకి వెళ్లి పడుకున్నారు. అలా నిద్రలోకి వెళ్లిన ఆమె శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు అంటూ రవికుమార్ గుర్తు చేసుకున్నారు. ఈ విధంగా నాన్నగారి కోరికను తీర్చడం కోసం అమ్మ ప్రాణాలను కోల్పోయిందని ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

































