ట్యాక్సీ డ్రైవర్ గా అతడు పనిచేస్తున్నాడు. వివాహం అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువతి అతడి ట్యాక్సీలోనే ఇంటికి.. మరియు ఆసుపత్రికి వెళ్తూ ఉండేది. దీంతో పెళ్లైన అతడితో ప్రేమలో పడింది. కానీ అతడు.. ఆమె ప్రేమకు నిరాకరిస్తూ వచ్చాడు. వినకపోవడంతో ఇతరులతో ఆమె ఫోన్ చేయిస్తూ బెదిరించింది. చివరకు అతడు అత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన వేముల గణేశ్.. గోదావరి అనే యువతితో వివాహం జరిగింది. వాళ్లకు ఒక కుమారుడు, కూతురు కూడా ఉన్నారు. అతడు జీవనోపాధి కోసం ట్యాక్సీ నడుపుతుండగా.. తన భార్య ఇంటి దగ్గరే హౌస్ వైఫ్ గా ఉంటుంది. ఇదిలా ఉండగా.. అదే మండలానికి చెందిన తాటిపల్లికి చెందిన ఓ యువతి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది.
తన ఇంటికి.. ఆసుపత్రికి గణేశ్ ట్యాక్సీలోనే వెళ్తుండేది. అయితే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు అది కాస్త ప్రేమగా మారింది. కానీ ఆ ప్రేమకు గణేశ్ మాత్రం ససేమిరా అన్నాడు. తనకు వివాహం అయిందని ఎంత చెప్పినా ఆ యువతి వినిపించుకోలేదు.
ఆ రోజు నుంచి అతడు ఆమెను దూరంగా పెడుతున్నా.. ఇతరులతో ఫోన్ చేయించి బెదిరించసాగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గణేశ్.. పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
































