దేశంలో ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నారు. అయితే లాక్ డౌన్ నిబంధనల వల్ల దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. కరోనా ఉధృతి తగ్గినప్పటికీ దేశంలోని ప్రజలకు పూర్తిస్థాయిలో రైళ్ల సర్వీసులు అందుబాటులోకి రాలేదు. అయితే అత్యసర ప్రయాణాల కోసం చాలామంది ప్రయాణికులు తత్కాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.

కొందరు సులభంగా తత్కాల్ టికెట్ ను బుకింగ్ చేసుకుంటే కొందరు ప్రయాణికులు ఎంత కష్టపడినా తత్కాల్ టికెట్ దొరకక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా సులభంగా తత్కాల్ టికెట్ ను బుకింగ్ చేసుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులు తత్కాల్ టికెట్ ను ప్రయాణించే తేదీ కంటే ఒకరోజు ముందు ఏసీ టికెట్ల కోసం 10 గంటలకు స్లీపర్ టికెట్ల కోసం 11 గంటలకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

తత్కాల్ టికెట్ బుకింగ్ చేయాలంటే ఒక ఐడీతో ఒకే బ్రౌజర్ లో లాగిన్ కావడం మంచిది. రైళ్లలో ఎక్కువ సీట్లను ఉన్న రైలును ఎంచుకుంటే సులభంగా టికెట్ చేసుకునే అవకాశంతో పాటు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. టికెట్ బుకింగ్ కోసం వన్ టైమ్ పాస్ వర్డ్ అవసరం లేని పేమెంట్లను ఎంచుకుంటే త్వరితగతిన టికెట్ బుకింగ్ చేయవచ్చు. బుకింగ్ మొదలుకావడానికి ముందే స్టేషన్ కోడ్ , బెర్త్ వివరాలను ఎంచుకుంటే సెకన్ల వ్యవధిలో ప్రయాణికుల వివరాలు నమోదు చేసి టికెట్ బుకింగ్ చేయవచ్చు.

మాస్టర్ లిస్ట్ ఆప్షన్ లేదా మై ప్రొఫైల్ సెక్షన్ లో వివరాలను నమోదు చేయడం ద్వారా సులభంగా ప్రయాణికుల పేర్లు ఎంటర్ చేయకుండా టికె్ట్లు బుకింగ్ చేసుకోవచ్చు. టికెట్ల బుకింగ్ సమయంలో ఇంటర్నెట్ స్పీడ్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్నెట్ స్పీడ్ గా ఉంటే సులువుగా టికెట్ బుకింగ్ చేయడం సాధ్యమవుతుంది. ఈ టిప్స్ పాటించడం ద్వారా సులభంగా ట్రైన్ టికెట్ ను బుకింగ్ చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here