ప్రకృతిలో ఉపయోగపడనది అంటూ ఏదీ ఉండదు. ప్రతీ వస్తువు ఈ సమస్తంలో ఉపయోగపడుతుంది. పల్లెటూర్లో పొలాల గట్ల వెంటతిరిగేపప్పడు మనకు ఎక్కువగా గడ్డి కనిపిస్తుంటుంది. అది కూడా పశువులకు ఉపయోగపడుతుంది. ఇక మనం చెప్పేది ఏంటంటే.. గోధుమ గడ్డి వల్ల మానవులకు ఎంత ఉపయోగం.. ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

ఆయుర్వేదం ప్రకారం గోధుమ గడ్డి రసం రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో తీసుకుంటే ఎన్నో లాభాలున్నాయి. పొడిగా, టాబ్లెట్ల రూపంలో లభిస్తున్న గోధుమ గడ్డిని.. రసం చేసుకొని తాగితేనే మంచింది. పుష్కలంగా ఫైబర్ ఉండే గోధమ గడ్డిని క్రమం తప్పకుండా తీసుంటే అర్షమొలలకు చక్కని ఔషదంగా పనిచేస్తుంది. అజీర్ణం, గ్యాసం, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు. జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు అధికంగా ఉండే ఇందులో.. శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. అలర్జీలు రాకుండా, అస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులను అరికట్టేలా చేస్తుంది.
దీనిలో విటమిన్ “ఈ ‘తో పాటు ఇతర పోషకాలు ఉన్నాయి.అయితే చాలామందికి దీనియొక్క ఉపయోగాలు తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే గోధుమగడ్డి రసం కేన్సర్ చికిత్సలో కూడా చాలా అద్బుతఫలితాలు ఇచ్చింది. ఇది జలుబు , దగ్గు లాంటి చిన్నచిన్న వ్యాధులనే కాక బ్లడ్ కేన్సర్ , కేన్సర్ వంటివాటిలో కూడా చక్కని ఫలితాలు ఇస్తుంది. క్లీరోఫిల్ అనేది పత్రహరితంలో ఉంటుందని మనకు చాలా వరకు తెలుసు. అయితే ఆ క్లోరోఫిల్ ఇప్పుడు ఈ రసాన్ని తీసుకోవడం ద్వారా రక్తాన్ని శుద్దిచేస్తుంది. పేగుల్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
ప్రేగుల్లోని చెత్తాచెదారాన్ని గోధుమగడ్డి క్లీన్ చేస్తుంది. అల్సర్ వంటి సమస్యను జయించేలా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్నా గోధుమ గడ్డిని.. ఇంట్లోని పూలకుండీల్లోనూ పెంచుకోవచ్చు. దీర్ఘకాలిక జలుబు , అర్షమొలలు , వయస్సుకు ముందే జుట్టు నెరవడం , స్త్రీ గర్భసంబంధ వ్యాధులు , నిద్రలేమి , రక్తహీనత , కేన్సర్, గుండెవ్యాధి , కీళ్లు , కండరాల వ్యాధులు , ఆస్తమా , వంధత్వము , కన్ను , చెవి సంబంధ వ్యాధులు , కంపవాతం , చర్మవ్యాధులు , మానసిక , శారీరక వ్యాధులు , మూత్రకోశ సంబంధ వ్యాధులు , మూత్రపిండాలలో రాళ్లు , మలబద్దకం , కడుపువ్యాధులు , మధుమేహం వ్యాధులతో బాధపడే వారు రోజుకు ఈ గోధుమ గడ్డిని ఉదయం 4 గ్లాసుల చొప్పున తీసుకుంటే 21 రోజుల్లో మనకు తేడా కనిపిస్తుంది.