ఏ ఆహారం తినాల్లన్నా చాలామందికి వేడిగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రతిదీ వేడి చేసిన తినలేం. వండిన వెంటనే తింటే.. ఆహారం వేడిగా ఉంటుంది. కొన్ని గంటలు ఆగిన తర్వాత సాధారణంగా ఏ ఆహారం అయినా చల్లారుతుంది. అయితే చల్లారిన ఆహారాన్ని కూడా వేడి చేసుకొని తినొచ్చు. అందులో ముఖ్యంగా కొన్ని పదర్థాలను రెండో సారి వేడిచేసి తింటే అనారోగ్యాలు చుట్టుముడుతాయని వైద్యులు చెబుతున్నారు.

అవేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా.. గుడ్లు ప్రోటీన్ల యొక్క భాండాగారం. అయితే వాటిని ఉడికించి తినడం.. ఆమ్లెట్ రూపంలో తినడం చేస్తాం. వాటిని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి.. వాటిని రెండోసారి వేడి చేయకూడదు. ఎందుకుంటే.. అందులో ఉండే నత్రజనిని రెండో సారి వేడిచేయడంతో క్యాన్సర్ కు దారి తీస్తుందట. ఒకవేళ చల్లగా ఉంటే.. వాటిని తినాలి..కానీ మళ్లీవేడి చేయవద్దని వైద్యలు సలహా ఇస్తున్నారు.
మరొ పదార్థం ఏంటంటే.. అన్నం. చల్లారిన అన్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేడి చేయకూడదని ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ తెలిపింది. ఇలా వేడిచేసి తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బంగాళదుంపకు సబంధించి ఏదైనా రెసిపీని రెండో సారి వేడి చేయకూడదు. ఒక వేళ అలా చేస్తే.. అందులోని బాక్టీరియా ఉత్తేజితమై హాని కలిగిస్తుంది. చికెన్ ను కూడా రెండోసారి వేడి చేయకూడదు. వండిన చికెన్‌ను రెండోసారి వేడి చేయడం ద్వారా ప్రోటీన్ అణువు విచ్ఛిన్నమవుతుంది.
దీంతో మనం దానిని తిన్నా.. ఇలాంటి ఉపయోగం లేకపోగా.. లేనిపోని రోగాల బారిన పడతాని వైద్యులు చెబుతున్నారు. ఇక చివరగా .. కూరగాయలు. ఎలాంటి కూరగాయలను కూడా రెండో సారి వేడి చేయకూడదు. ఇలా చేస్తే అందులో ఉన్న నైట్రోజన్.. హాని కారమైన రసాయాన్ని ఉత్పత్తి చేసి.. వివిధ రకాల వ్యాధులబారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.




























