ప్రస్తుత కాలంలో ఎంతోమందిని వేధించే సమస్యలలో స్కిన్ ఇన్ఫెక్షన్ల సమస్య ఒకటి అని చెప్పవచ్చు. వాతావరణ కాలుష్యం వల్ల రోజుకు ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతోంది.అంతేకాకుండా కొందరి శరీర తత్వాలను బట్టి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ విధంగా చర్మ సమస్యలు రావడానికి ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన కారణాలు తలెత్తుతుంటాయి. ఈ విధంగా స్కిన్ ఇన్ఫెక్షన్లు మనలో వ్యాపించే కూడదు అంటే వ్యక్తిగత పరిశుభ్రత ఇందుకు చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యనుంచి విముక్తిని పొందవచ్చు. అయితే ఆ మార్గాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
చర్మ సమస్యలతో బాధపడేవారు ముందుగా వ్యక్తిగతంగా మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఎక్కువగా నీటి శాతం కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు అధిక మొత్తంలో నీటిని తాగాలి. ముఖ్యంగా దుస్తులను ధరించే విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల దుస్తులను ధరించకూడదు. అదేవిధంగా దుస్తులు మన శరీరానికి అనుకూలంగా ఉండేవిధంగా వేసుకోవాలి.
మన చర్మం పై ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే వేడి నీటితో శుభ్రం చేసుకొని వాటిపై యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ క్రీములను రాసుకోవాలి. ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు వాతావరణ కాలుష్యం వల్ల చాలా మందికి చర్మ సమస్యలు ఎదురవుతాయి.ఆ విధంగా బయటకు వెళ్లేటప్పుడు మొహానికి స్కార్ఫ్ ధరించి జాగ్రత్తలు తీసుకోవాలి.బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు శుభ్రంగా కాళ్లు, చేతులను కడుక్కోవడం వీలైతే స్నానం చేయడం ఉత్తమం.ఇకపోతే మధుమేహ సమస్యతో బాధపడేవారు వారి చర్మ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా చర్మ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.