పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ కార్డ్ తో ఇంటి అద్దె చెల్లించే ఛాన్స్..?

0
147

డిజిటల్ పేమెంట్స్ సంస్థలలో ఒకటైన పేటీఎం సంస్థ కస్టమర్లకు గత కొన్ని నెలల నుంచి కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తాజాగా పేటీఎం క్రెడిట్ కార్డ్ సహాయంతో ఇంటి అద్దె చెల్లించే అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా క్రెడిట్ కార్డుల సహాయంతో టికెట్ల బుకింగ్, రీఛార్జ్, ఆన్ లైన్ పేమెంట్స్, షాపింగ్ చేస్తూ ఉంటాం. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా రూమ్ రెంట్ కూడా చెల్లించే ఛాన్స్ అంటే కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది.

గతంలో పలు యాప్స్ ద్వారా ఇంటి ఓనర్లకు క్రెడిట్ కార్డ్ సహాయంతో ఇంటి రెంట్ చెల్లించే అవకాశం ఉండేది. అయితే పేటీఎం ఆ యాప్స్ అవసరం లేకుండా డైరెక్ట్ గా రూమ్ రెంట్ చెల్లించే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం. అయితే పేటీఎం క్రెడిట్ కార్డ్ ద్వారా ఎవరైతే రూమ్ రెంట్ ను చెల్లిస్తారో వాళ్లు అదనంగా 2 శాతం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే అదనంగా 2 శాతం చెల్లించినా రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్ బ్యాక్ రూపంలో డబ్బులు లభిస్తాయి.

1,000 రూపాయలకు 20 రూపాయల చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్లు ఎవరైనా పేటీఎం యాప్ ను ఓపెన్ చేసి ఆల్ సర్వీసెస్ ఆప్షన్ ను ఓపెన్ చేసి ఆ తరువాత మంత్లీ బిల్స్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అక్కడ రెంట్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇంటి ఓనర్ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా సులభంగా లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుంది.

అయితే రూమ్ రెంట్ ను డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. కానీ క్రెడిట్ కార్డును ఎక్కువగా వినియోగించే వాళ్లకు పేటీఎం కొత్త సర్వీసుల ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here