సమస్యలను ఏ రాశివారు ఎలా పరిష్కరిస్తారో తెలుసా?

0
286

సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన వ్యక్తిత్వాన్ని మన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగా చెబుతుంటారు. కొన్ని రాశుల వారికి వివిధ రకాల నైపుణ్యాలు ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనకు అనుకోకుండా సమస్యలు వచ్చి పడతాయి.ఈ విధంగా సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎంతో చాకచక్యంగా పరిష్కరించాల్సి ఉంటుంది. మరి సమస్యలు వచ్చినప్పుడు ఏ రాశి వారు ఏ విధంగా వాటిని పరిష్కరిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి: మేషరాశి వారు ఎంతో చాకచక్యంగా తెలివిగా ఉంటారు. వీరు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే వెంటనే స్పందించి వారికి సహాయం చేస్తారు. అదేవిధంగా వీరికి ఏవైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను ఇతరులకు తెలియకుండా పరిష్కరించుకుంటారు.

వృషభం: వృషభ రాశి వారు కొంత భయాందోళనలో ఉంటారు. వీరికి అనుకోని సమస్య వచ్చి పడితే తీవ్రమైన కంగారుతో ఏం చేయాలో అర్థం కాక తికమకపడుతుంటారు.

మిధునం: మిధున రాశి వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు మొదటగా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, తన కుటుంబాన్ని ఎలా గట్టెక్కించాలని అనే విషయం గురించి ఆలోచించి తొందరగా ఆ సమస్యను పరిష్కరించడానికి ఆరాటపడతారు.

కర్కాటకం: కర్కాటక రాశి వారు ఎంతో సున్నితమైన వ్యక్తిత్వం కలవారు. వీరికి ఏదైనా సమస్య వస్తే ముందుగా వీరు వీళ్ళు ఎంతగా ప్రేమించే వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు.

సింహం: సింహ రాశి వారు సాధారణంగానే ఎంతో తెలివిగా ఉంటారు. అలాంటిది వీరికి ఏదైనా కష్టాలు సమస్యలు వస్తే వాటిని ఎంతో సునాయాసంగా ఎదుర్కొంటారు. కనుక వీరి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.

కన్య: కన్య రాశి వారు ఎంతో నెమ్మదస్తులు వీరికి ఏదైనా కష్టం వచ్చిందంటే ఏ మాత్రం కంగారు పడకుండా, ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఎంతో నెమ్మదిగా ఆ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తారు.

తుల: తులా రాశి వారికి ఏదైనా సమస్య వచ్చిందంటే ఇక అంతే సంగతులు. వీళ్లు కంగారుపడుతూ ఇతరులను కూడా కంగారు పెడుతుంటారు. ఇలాంటి సమయంలో వీరిని అదుపు చేయడం ఎంతో కష్టం.

వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఏదైనా అనుకోని సమస్య వచ్చి పడితే తీవ్రమైన కోపంతో ఆవేశ పడుతుంటారు. వీరు ఆ సమస్యను అధిగమించ లేక ఇతరులపై వారి కోపాన్ని చూపెడతారు.

ధనస్సు: ధనస్సు రాశి వారికి ఏవైనా కష్టాలు ఎదురైతే ఒక్కసారిగా ఎంతో షాక్ కి గురవుతారు. ఇటువంటి సమయంలో వీరు ఏం చేయాలో దిక్కుతోచక ఎంతో నిశ్శబ్దంగా ఉండి పోతారు. ఈ సమయంలోనే వీరి మెదడులో ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు మెదులుతూ ఉంటాయి.

మకరం: మకర రాశి వారికి ఏదైనా సమస్యలు తలెత్తితే లోపల ఎంతో భయపడుతున్నప్పటికీ బయటకు మాత్రం అందరికీ ధైర్యాన్ని చెబుతారు. ఈ విధంగానే అందరికీ ధైర్యం చెబుతూ సమస్యను పరిష్కరించుకుంటారు.

కుంభం: కుంభ రాశి వారికి ఏదైనా సమస్య వస్తే తొందరగా ఎమోషన్ అవుతారు. ఈ క్రమంలోనే ఈ సమస్య నుంచి ముందుగా తన వాళ్లను రక్షించుకోవడం కోసం తాపత్రయ పడతారు.

మీనం: మీన రాశి వారు ఎంతో సరదాగా ఉంటారు.వీరికి ఏదైనా సమస్య వస్తే అక్కడే ఆగకుండా ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని భావిస్తారు.