ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ప్రభావ తీవ్రత ఏ విధంగా ఉందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనాకు సంబంధించిన చికిత్స గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సమాచారం జరుగుతోంది.ఇలా చేయడం వల్ల కరోనా రాదు ఇలా చేస్తే కరోనా వస్తుందని తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను ఎంతో అయోమయానికి గురి చేస్తున్నారు. కొందరు ఈ పద్ధతులను పాటించడంతో ఏకంగా వారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

తాజాగా వేడి నీటితో స్నానం చేస్తే, వేడి నీళ్లను తాగితే కరోనా వైరస్ రాదనే ప్రచారం జోరుగా సాగుతోంది.అయితే వేడి నీటితో స్నానం చేసి వేడి నీటిని తాగడం వల్ల కరోనా వైరస్ చనిపోతుందని తాజాగా భారత ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ ప్రయోగశాలలోనే 60 నుంచి 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే మరణిస్తుందని నిపుణులు తెలిపారు.
వేడి నీటిని త్రాగటం, వేడి నీటితో స్నానం చేయడం వల్ల కరోనా వైరస్ చనిపోవడం మాట అవాస్తవమే అయినా వేడి నీటితో స్నానం చేయటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. మన శరీరంలో నొప్పులు, కండరాల నొప్పులు, తగ్గిపోయి మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అదేవిధంగా రక్తప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇక గోరువెచ్చని నీటిని త్రాగటం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా మన ప్రేగులలో ఏర్పడిన మలినాలు కూడా వేడి నీటిని త్రాగటం వల్ల బయటకు విసర్జించబడతాయి. తద్వారా జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కానీ వేడి నీటిని తాగటం వేడి నీటితో స్నానం చేయడం వల్ల కరోనా వైరస్ చనిపోతుంది అనడం పూర్తిగా అవాస్తవమేనని నిపుణులు తెలియజేస్తున్నారు.






























