సాధారణంగా హౌస్ ఫుల్ బోర్డులు మనకు థియేటర్ల ముందు దర్శనమిస్తాయి.కానీ స్మశానవాటికలు ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమివ్వడం ఎప్పుడైనా చూశారా.. ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో కర్ణాటక రాష్ట్రంలో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అధికంగా ఉండడంతో బెంగళూరులోని పలు స్మశాన వాటికల బయట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే కరోనా మహమ్మారి ఏస్థాయిలో పంజా విసురుతోందో అర్థమవుతుంది.

ఆదివారం ఒక్కరోజే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 217 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఉన్న స్మశానలన్ని నిండిపోవడంతో పాటు, పెద్ద ఎత్తున శవాలు రావడంతో దహన సంస్కరణలు చేయటానికి స్మశానలలో ఖాళీగా లేకపోవడంతో బెంగళూరులోని స్మశానవాటికలో బయట హౌస్ ఫుల్ బోర్డులను తగిలించారు.

రోజుకు 20 కి పైగా కరోనా మృతదేహాలు వస్తుండడంతో చామ్‌రాజ్‌పేటలోని శ్మశాన వాటిక నిర్వాహకులు హౌస్‌ఫుల్ బోర్డు పెట్టారు. బెంగళూరు సిటీ లో 13 ఎలక్ట్రిక్ దహన వాటికలు ఉండగా అవి అన్ని మృతదేహాలతో బిజీగా ఉండడంతో స్మశానలలో కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి ఖాళీ స్థలం లేదు. దీంతో కర్ణాటక ప్రభుత్వం మహానగర్‌ పాలికె (బీబీఎంపీ)కి 230 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఆ ప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ క్రమంలోనే కరోనాతో మృతిచెందిన మృతులకు సొంతగా ఫామ్ హౌస్, సొంత ఫ్లాట్ లు ఉంటే అక్కడే దహన సంస్కరణలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇప్పటివరకు కర్ణాటకలో 16 లక్షల కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here