సాధారణంగా 15 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వరకు ప్రతి నెల పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. నెలసరి అనేది 21 నుంచి 28 రోజుల వ్యవధిలో వస్తుంది.కొందరిలో పీరియడ్స్ సక్రమంగా వస్తూనే ఉంటాయి కానీ చాలామంది పీరియడ్స్ లో లేటుగా రావటం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. అయితే నెలసరి ఈ విధంగా ఇర్రెగ్యులర్ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల నెలసరి లేటుగా వస్తుంది.

మరికొందరు జన నియంత్రణ మందులు వాడటం, బరువు అధికంగా ఉండటం, వయసుకు తగ్గ బరువు లేకపోవడం వంటి సమస్యల వల్ల నెలసరి ఆలస్యంగా వస్తుంది.నెలసరి ఆలస్యంగా రావడమే కాకుండా కొందరిలో అధిక రక్తస్రావం జరుగుతుంది.ఈ విధమైనటువంటి అధిక రక్తస్రావం జరిగినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.సాధారణంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత కారణంగానే నెలసరి అనేది సక్రమంగా రాదు.

నెలసరి సక్రమంగా రావాలంటే మన ఆహార విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ పదార్థం ఈస్ట్రోజన్ హార్మోన్ ను ఉత్తేజ పరుస్తుంది.తద్వారా నెలసరి సక్రమంగా రావడమే కాకుండా నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి విముక్తి కలిగిస్తుంది.

నెలసరి సక్రమంగా రాకపోతే ఎక్కువగా విటమిన్ సి లభించే తాజా పండ్లను తీసుకోవాలి. ఈ పండ్లలో ఉండే కెరోటిన్ పదార్థం ఈస్ట్రోజన్ హార్మోన్ ను స్టిమ్యులేట్ చేస్తుంది. అదేవిధంగా ఖర్జూరాలు, బొప్పాయి, బెల్లం,వంటి ఆహార పదార్థాలను తీసుకోవటమే కాకుండా కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి నెలసరి సక్రమంగా వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here