అన్ని బంధాల కంటే వివాహ బంధం చాలా గొప్పది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. పిల్లలలో జీవితాంతం కలిసి ఉండాల్సింది భార్యభర్తలే. అయితే మధ్యలో చిన్న చిన్న మనస్పర్థలు లాంటివి వస్తే.. వాటిని సర్దుకుంటూ ముందుకు వెళ్లాలి.

ఇలానే తమ సంసార జీవితాన్నిచాలామంది గడుపుతారు. ఒకరికి కోపం వచ్చిందంటే.. మరొకరు కూల్ గా ఉంటూ సహనం పాటించాలి. లేదంటే.. ఇద్దరి కోపాలతో క్షణికావేశంతో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వాళ్లకు పెళ్లి జరిగి నెల రోజులు కూడా కాలేదు.. నవ వధువు కన్నుమూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నూతన వధువు.. పెళ్లైన నెలకే కన్నుమూసింది.
కిరణ్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని బాచుపల్లి ప్రగతి నగర్ లో నివాసం ఉంటున్నాడు. అతడికి 22 ఏళ్ల సుధారాణితో నెల రోజులక్రితం పెళ్లి అయింది. పెళ్లి తర్వాత ఇద్దరు 20 రోజుల వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత రోజు నుంచి అతడు తన భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు.
అనుమానం అనే భూతం ఒక్కసారి మొదలైందంటే.. అది తొలగిపోవడం అనేది చాలాకష్టం. దీంతో అతడు ఆవేశంతో ఓ అర్థరాత్రి తన భార్య గొంతుకోసి చంపేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
































