హైదరాబాద్ వరద బీభత్సానికి కారణం ఆక్రమణలే.. తేల్చి చెప్పిన నీతి అయోగ్.!

0
125

2020 అందరికీ చేదు అనుభవాలే మిగిల్చింది. ఒక వైపు కరోనా యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది.. ఇక భాగ్యనగర వాసులను అయితే కరోనాతో పాటు వరదలు కూడా బెంబేలెత్తించాయి. 2020 అక్టోబర్ లో సంభవించిన ఈ ఉత్పాదాన్ని ఎవరూ మర్చిపోలేరు. అయితే తాజగా ఈ వరదల బీభత్సానికి కారణం హైదరాబాద్ లో జరిగిన ఆక్రమణలే కారణం అని తేల్చి చెప్పింది నీతి అయోగ్.

ఒకప్పుడు హైదరాబాద్ మరియు చుట్టూ పక్కల ప్రాంతాలలో దాదాపు లక్ష వరకు చెరువులు, కుంటలు, బావులు వంటి నీటి వనరులు ఉండేవని.. ఇప్పుడు ఆ లక్ష కాస్త 185కి తగ్గిపోయాయని వెల్లడించింది. చెరువులు, కుంటలను ఆక్రమంచి నిర్మాణాలు చేపట్టడం వల్లనే ఈ ఉత్పాతం సంభవించిందని పేర్కొంది. హుస్సేన్ సాగర్ గట్లు, నాలాలన్నీ కబ్జాలకు గురవడమే ప్రధాన కారణమని తెలిపింది నీతి అయోగ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here