బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో లో ఆర్టిస్ట్ గా పరిచయమైన హైపర్ ఆది తరువాత రైటర్ గా, టీమ్ లీడర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా పలు టీవీ కార్యక్రమాల్లో ఎంతో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా హైపర్ ఆది స్కిట్ లలో వేసే పంచులు ద్వారా అందరిని ఆకట్టుకుంటున్నాడు.

జబర్దస్త్ మాత్రమే కాకుండా ఢీ షో లో కూడా హైపర్ ఆది మార్క్ ఏమిటో నిరూపించుకున్నాడు. జబర్దస్త్ షోలో వర్షిని లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు.బుల్లితెరపై ఈ విధంగా సందడి చేసిన హైపర్ ఆది ప్రస్తుతం వెండితెర పై పలు సినిమాలలో చేస్తూ బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా సెటిల్ అయిన హైపర్ ఆది పెళ్లి చేసుకుని జీవితంలో కూడా సెటిల్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

హైపర్ ఆది ముందుగా సుడిగాలి సుదీర్ యాంకర్ ప్రదీప్ పెళ్లి తర్వాతే తన పెళ్లి చేసుకుంటానని ఇదివరకు ప్రకటించారు.అయితే పెళ్లి విషయంలో ప్రస్తుతం హైపర్ ఆది తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హైపర్ ఆది పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది.

హైపర్ ఆది ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తన తల్లిదండ్రులు చూపించిన ఒక అమ్మాయిని తను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలియజేశాడు. అయితే ఆ అమ్మాయి మరెవరో కాదు తన సొంత జిల్లా అయిన ప్రకాశం అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు హైపర్ ఆది తెలియజేశారు. ఈ విధంగా హైపర్ ఆది పెళ్లి వార్త వినడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here