మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా విష్ణు ఎన్నికల ప్రచారంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే మీడియా ఎదురుగా మంచు విష్ణు మాట్లాడిన మాటలు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా బుల్లితెర చానల్స్ పలు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈటీవీ దీపావళి పండుగ పురస్కరించుకుని తగ్గేదేలే అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఒకే వేదికపై చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది మంచు విష్ణు ఇమిటేట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ స్కిట్ లో భాగంగా హైపర్ ఆది రోజాతో మాట్లాడుతూ అన్ని మీకే తెలిసినట్టు మాట్లాడతారు ఇందాక మా సైడ్ నుంచి ప్రియమణి వచ్చి ఏమన్నారంటే అని హైపర్ ఆది అనగా.. అందుకు రోజా ఏమన్నారు అని అడగగా.. వెంటనే రాంప్రసాద్ హైపర్ ఆదిని పట్టుకుంటాడు.
ఈ క్రమంలోనే వారిని విడిపించుకునేందుకు హైపర్ ఆది
లెట్ దెమ్ నో అంకుల్..లెట్ దెమ్ నో అంటూ మా ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలను ఇమిటేట్ చేశారు. అలాగే స్కిట్ లో గెటప్ సీను లేకపోవడం సరిపోయింది. ఆయనే కనుక ఉంటే మీకు మంచి గుణపాఠం చెప్పే వారని ఆది డైలాగులు వేశాడు. ఇలా హైపర్ ఆది వేదిక పై మంచు విష్ణును టార్గెట్ చేస్తూ చేసిన ఈ స్కిట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































