Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సమంత ఎంతో మంచి పేరు సంపాదించుకున్నా, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం ఎంతో సంతోషంగా సాగిపోతోందనుకున్న జీవితంలో తుఫానుల మనస్పర్ధలు రావడం ఆ బంధం నుంచి విడిపోవడం జరిగిపోయింది.

ఈ క్రమంలోనే ఈ వివాహ బంధం నుంచి బయట పడిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా విడాకులు ప్రకటించిన తర్వాత తను ఎలాంటి మానసిక సంఘర్షణలను ఎదుర్కొందో ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా తెలిపారు. ఈ క్రమంలోనే మరొక ఇంటర్వ్యూ ద్వారా ఈమె తన బాధను వ్యక్తపరిచారు.

రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.. నేను జీవితంలో మానసిక సమస్యలను ఎదుర్కొన్నాను.ఆ సమయంలో నా స్నేహితులు, నా కుటుంబం, నా కౌన్సిలర్లు నన్ను ముందుకు నడిపించారు. నేడు నేను ఎంతో ధైర్యంగా నిలబడి ఉన్నాను అంటే అందుకు కారణం వాళ్లేనని ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.
మనసుకు దెబ్బ తగిలినప్పుడు కూడా వెళ్ళవచ్చు..
మన శరీరానికి ఒక చిన్న గాయం తగిలితే వైద్యుని దగ్గరకు ఎలా వెళ్తామో, మనసుకు గాయం తగిలినప్పుడు కూడా వైద్యుల దగ్గరికి వెళ్ళవచ్చని సమంత ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన చేదు జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకొని బాధపడ్డారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సమంత యశోద అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
































