‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా…’ ప్రస్తుతం ఇంటర్నెట్ ను ఊపేస్తున్న తాజా ఐటెం సాంగ్. పుష్ప సినిమాలో సమంత చేసిన ఈ ఐటెం సాంగ్ యమ క్రేజ్ సంపాదించుకుంది. సాంగ్ లో సమంత కవ్వించే స్టెప్పులు.. దేవీ శ్రీ ప్రసాద్ మాస్ బీట్లు… ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్ ఇలా అన్ని కుదిరి సాంగ్ పెద్ద హిట్ అయ్యింది.

పాట విడుదలయిన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అన్ని భాషల్లో కలిపి 4.5 కోట్ల మంది ఈ పాటను చూశారు. ఇదిలా ఉంటే.. ఈ సాంగ్ పై వివాదం కూడా నడుస్తోంది. మీ మగ బుద్దే వంకర బుద్ది అంటూ సాగే పాటపై ఏపీ పురుషుల సంఘం కేసు వేసింది.
మగాళ్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా పాట ఉందంటూ.. కోర్ట్ కెక్కారు. ఈ వివాదంపై నటి మాధవీ లత కూడా స్పందించింది. నేను కూడా కేసు పెడుతా.. అంటోంది. అయితే సమంత సాంగ్ పైన కాదండోయ్.. ‘‘రారా సామీ ’’ సాంగ్ పైన కేసు పెడుతా అంటోంది.
ఇది కూడా పుష్ప మూవీలో సాంగ్ కావడం విశేషం. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ఇండస్ట్రీలో 98 శాతం పాటలపైన కేసు పెట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ఒక మగాడు నడిచివెళ్లుతుంటే.. మహిళ తన వెంటే వెళ్తుందా.. ఒక మహిళ పరువు పోయింది. నాకు నచ్చలే అంటూ.. ఫెస్ బుక్ లో పోస్ట్ పెట్టింది మాధవీలత.


































