తెలుగు వారికి అత్యంత ప్రియమైన వంటకాల్లో జొన్న రొట్టెలు ప్రధానంగా చెప్పవచ్చు. జొన్న ధాన్యంలో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. జొన్నలను ప్రాంతాన్ని బట్టి జోవార్, సొర్లుమ్ వంటి అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే జొన్నలను అధికంగా ఆహారంలో ఉపయోగించే వారు. అయితే ఈమధ్య కాలంలో జొన్న ధాన్యంలోని పోషక విలువలు గుర్తించిన చాలామంది జొన్నలను ఆహారంగా తీసుకోవటానికి మక్కువ చూపిస్తున్నారు.

మన రోజువారీ ఆహారంలో జొన్న రొట్టెలను, జొన్నల పిండితో తయారు చేసిన వివిధ రకాల వంటకాలను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
జొన్న ధాన్యంలో ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాపర్, ఐరన్, పుష్కలంగా ఉంటాయి.కావున జొన్న రొట్టెలను, ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం వల్ల బీపీ, గుండె జబ్బులు,కీళ్ల నొప్పులు వంటి వ్యాధులను తరిమేయవచ్చు.ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారు జొన్న రొట్టెలను తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
జొన్న దాన్యంలో ఫోలిక్ యాసిడ్, ఐరన్, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్,సమృద్ధిగా ఉంటాయి. కావున రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరిగి ప్రమాదకర రక్తహీనత సమస్యను ఎదుర్కొని మన శరీరానికి అవసరమైన వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటిని ప్రతి రోజూ ఆహారంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్దకం, మొలలు, పేగు కేన్సర్ వంటి వివిధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అతి బరువు సమస్య ఉన్నవారు తమ రోజువారీ ఆహారంలో జొన్నలతో చేసే వంటకాలు తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది.






























