ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ ఆహారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఉసిరి రసం, చియా సీడ్స్ కలయిక ఇప్పుడు హెల్త్ డ్రింక్‌గా మంచి గుర్తింపు పొందుతోంది. పోషకాలతో నిండిన ఈ రెండు పదార్థాలు కలిసి శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉసిరిలో విటమిన్-సి సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరగడంలో ఇది సహాయపడుతుంది. చియా సీడ్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించడంలో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి కొంత రక్షణ లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా ఈ మిశ్రమం ఉపయోగపడొచ్చని చెబుతున్నారు. చియా సీడ్స్‌లో ఫైబర్ అధికంగా ఉండటంతో ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో అనవసరంగా తినే అలవాటు తగ్గి బరువు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.
జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది మేలు చేసే అవకాశముందని అంటున్నారు. ఉసిరి రసం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడితే, చియా సీడ్స్ మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతాయని చెబుతున్నారు. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యం కోసం కూడా ఈ డ్రింక్‌ను చాలామంది తీసుకుంటున్నారు. చియా గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉసిరి రసం రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కొంతవరకు ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ మిశ్రమం మంచిదేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరిలోని విటమిన్-సి చర్మానికి సహజ కాంతి తీసుకురావడంలో సహాయపడుతుందని, చియా సీడ్స్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో ఉపయోగపడతాయని చెబుతున్నారు. అయితే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతోనే ఈ డ్రింక్‌ను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.



























