తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ది రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో వారంలోకి అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో విడుదల చేసిన ప్రోమోల్లో హౌస్ వేడేక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఏడో వారంలో నామినేషన్లు చాలా విభిన్నంగా సాగుతున్నాయి.

ప్రోమో మొదలైన దగ్గర నుంచి నామినేష్ ప్రక్రియ ఎప్పడు జరగని విధంగా జరుగుతుందని రవి చెబుతాడు. దాంతో ప్రోమో మొదలవుతుంది. తర్వాత ప్రియాంక సేఫ్ గేమ్ ఆడుతున్నారని ఫైర్ అవుతుంది. ఓ టేబుల్‌పై ఉన్న అరటిపండ్లని ఎవరైతే తీసుకుంటారో.. వారికి నామినేట్ చేసే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో షణ్ముఖ్, సిరి, కాజల్ గెలిచారు.
అలా యానీ మాస్టర్‌ని షణ్ముఖ్ నామినేట్ చేయగా సిరి.. మానస్‌ని నామినేట్ చేసింది. ‘సారీ చెప్పారు. కానీ నేను దాన్ని అంగీకరించలేకపోతున్నా’ అని తెలియజేసింది. ఆ తర్వాత కాజల్ ప్రియను నామినేట్ చేస్తుంది. ఇక అందులో సన్నీ, శ్రీరామ చంద్ర, జశ్వంత్ వేటగాళ్లుగా సందడి చేశారు. దీనిలో ప్రియాంక ఫుల్ ఫైర్ అవుతుంది.
అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని అంటుంది. ‘ఆరు వారాల నుంచి చదువుతున్నారా’ అని రవి అనగానే ‘నాకు నచ్చింది నేను చేస్తా, నేను హంటర్‌ని’ అంటూ సన్నీ సమాధానమిచ్చాడు. ప్రోమోలో మాత్రం నామినేష్ వేడి మాత్రం కనిపించింది.



























